పిఠావురం, (జనస్వరం) : తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజవర్గం గొల్లప్రోలు పట్నంలో పిఠాపురం జనసేన పార్టీ ఇంఛార్జ్ మాకినీడి శేషుకుమారి గారి ఆధ్వర్యంలో గొల్లప్రోలు పట్నంలో వినుకొండ అమ్మాజీ, పేకేటిబాబి, అనంతపల్లి, మేరీ, అరకుశ్రీనివాస్, మరదలా శ్రీనివాస్, గొల్లప్రోలుపట్నం జనసైనికుల కృషి ఫలితంగా 100మందికి జనసేన పార్టీ కండువాలు కప్పి ఇంఛార్జ్ 'మాకినీడి శేషుకుమారి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాకినిడు శేషుకుమారి మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలుకు, ఆదర్శాలకు అనుకూలంగా మేము సైతం అని మీ బాటలో అడుగు వేస్తాము అని నాయకులు, యువకులు ముందుకు రావడం జరిగింది. ఇలాగే మన జనసైనికులు ప్రతి ఒక్కరు పనిచేసి జనసేన పార్టీకి బలంగా నిలబడాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సందర్భంగా సుమారు 60 మంది అక్కచెల్లెమ్మలు, 40 మంది అన్నదమ్ములు యువకులు సుమారుగా 100మందికి జనసేన పార్టీ కండువాలు వేసి పిఠాపురం ఇంఛార్జ్ మాకినీడి శేషుకుమారి ఆహ్వానించారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి వెంట నడుస్తామని ముందుకు రావడం చాలా ఆనందంగా ఉందని రాను రాను పిఠాపురం నియోజకవర్గంలో వీరమహిళలు సంఖ్య పెరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగే ప్రతి ఒక్కరూ జనసేన పార్టీని కోరుకుంటున్నారని ప్రజలు ఈ వీరమహిళలలే ఉదాహరణ అని తెలియజేస్తున్నాను. పిఠాపురం నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో జనసేన జెండా ఎగరవేయడం ఖాయమని అలాగే మీకు ఏ కష్టం ఉన్న ఒక మీ ఇంటి ఆడపడుచులా మీకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటూ నా భర్త డాక్టర్ మాకినీడి వీర ప్రసాద్ వారి 'సేవలుతో అందిస్తామని భరోసా ఇస్తున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు మొగిలి అప్పారావు, కీర్తిచంటి, వినుకొండ అమ్మాజీ, చిన్నగాంధం నవీన్, చిన్నగాంధం శిరీష, ఎం. శ్రీనివాస్, ఏ. శ్రీనివాస్, డి.బంగారం, డి.బుజ్జి, వి.రమణ, ఏ.వెంకటేశ్వర రావు, ఏ.కళ్యాణ్ శివ, ఏ. మారి, ఎం అప్పల కొండ, జి.నాగమణి, పి.వరలక్ష్మి, వి.దేవి, రామిశెట్టీ సూరిబాబు, గంజి గోవిందు, కొండపల్లి శివ, కంద సోమరాజు, వాకపల్లి సూర్య ప్రకాష్, కొండపల్లి శివ, జనసైనికులు నాయకులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com