Logo
Date of Publish : 02 October 2023, 9:08 pm
Editor : Sake Naresh

పల్లెపొరులో గాంధీ జయంతి సాక్షిగా వైసీపీ సర్కారుపై ఘాటు విమర్శలు

      తాడేపల్లిగూడెం ( జనస్వరం ) : మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పెంటపాడు మండలం రావిపాడు గ్రామ పల్లేపోరులో భాగంగా ముందుగా గ్రామ పెద్దలతో కలిసి మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జై జవాన్ , జై కిసాన్ అంటూ దేశ ప్రజల్లో ప్రధానిస్ఫూర్తి రగిలించిన భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కూడా ఈ రోజే అవ్వడం,అహింసే పరమ ధర్మంగా సత్యాగ్రహం ద్వారా స్వాతంత్రాన్ని సాధించిన మహాత్ముని జయంతి సందర్భంగా వారిరువురికీ శ్రీనివాస్ నివాళులు అర్పించారు. అనంతరం గ్రామ ప్రజల ఉద్దేశించి సత్యం, అహింస అనే ఆయుధాలతో యుద్ధం చేయడం ఎలాగో ప్రపంచ మానవాళికి ఆచరించి చూపిన మహాత్ముడు మన గాంధీజీ అని అహింసా యుత ప్రజా పోరుతో పరాయి పాలన నుండి భారతదేశాన్ని విముక్తం చేశారని పేర్కొన్నారు. బాపూజీ జయంతి సందర్భంగా మహాత్ముడిని స్మరించుకుంటూ మనస్పూర్తిగా అంజలి ఘటిస్తున్నాను అని స్పష్టం చేశారు. అనంతరం వైసీపీ ప్రభుత్వ గురించి మాట్లాడుతూ బ్రిటిషర్ల లక్షణాలు పుణికి పుచ్చుకున్న పాలకులు రాష్ట్రంలో ఉన్నారంటూ మండిపడ్డారు. ప్రజలను వర్గాలుగా విభజించి పాలించే ధోరణిలో వెళ్తున్నారని శ్రీనివాస్ అసహనం వ్యక్తం చేశారు. అలాగే జనసేన అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరేలా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయాలు ఉంటాయనీ వచ్చే ఎన్నికలలో జనసేన పథకాలు గురించి స్థానిక ప్రజలకు వివరిస్తూ రావిపాడు గ్రామంలో బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆ గ్రామం లో పల్లెపోరును ముగించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com