నెల్లిమర్ల ( జనస్వరం ) : నెల్లిమర్ల నియోజవర్గంలో పూసపాటిరేగ మండలంలో వెల్దురు పంచాయతీలో బోరపేట గ్రామంలో శ్రీమతి లోకం మాధవి గారి ఆధ్వర్యంలో ఇంటింటి జనసేన జనంలో తీసుకెళ్లడం జరిగింది. జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు మరియు పార్టీ యొక్క మేనిఫెస్టోను మరియు పవన్ కళ్యాణ్ గారికి ఒక ఛాన్స్ ఇవ్వమని అడగడం జరిగింది మరియు మేడం గారికి ఒక ఛాన్స్ ఇవ్వమని అడగడం జరిగింది. త్రాగునీటి సమస్యలు మరియు డ్రైనేజీ సమస్యలు గురించి ప్రజలు ప్రస్తావిస్తూ ఉండగా ప్రతీ వాడలో ఇదే సమస్య వింటూ ఉన్నాను అసలు ప్రభుత్వ యంత్రాంగం ఏమి చేస్తుంది అని మండిపడ్డారు. మరియు మన జనసేన ప్రభుత్వం వచ్చాక ప్రజలందరికీ త్రాగునీటి సమస్య మరియు డ్రైనేజీ సమస్య లేకుండా పూర్తిస్థాయిలో ప్రజలందరికీ మరింత మెరుగుగా సేవలు అందించేందుకు జనసేన ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.ఆ గ్రామంలో ఉన్న సమస్యలను మేడం గారు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు వీర మహిళ బాసి దుర్గ, గుడివాడ జమరాజు, గుడివాడ శేఖర్, రాజారావు, టి శివాజీ, పి గణేష్, పి తిరుపతిరావు, పి సతీష్, లక్ష్మి నాయుడు, శ్రీరామ్, గణేష్, సన్నీ, కిషోర్, శ్రీను, వినయ్, అప్పలరాజు, వేణు తదితరులు పాల్గొనడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com