Logo
Date of Publish : 26 June 2023, 4:47 pm
Editor : Sake Naresh

వృద్ధాప్యంలో రామకోటి రాసుకో ముద్రగడ పద్మనాభం….

           సర్వేపల్లి ( జనస్వరం ) : జనసేన పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించిన సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు. ఆయన మాట్లాడుతూ వృద్ధాప్యంలో రామకోటి రాసుకోవాల్సిన ముద్రగడ పద్మనాభం మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి లేఖలు రాయడం మీకు అంత మంచిది కాదు. తునిలో 12 లక్షల మంది కాపులు మీకు మద్దతుగా నిలబడితే మీరు కాపులకు చేసింది ఏంది?. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరం రూ.2000 కోట్ల రూపాయల నిధులు కాపు కార్పొరేషన్ కి కేటాయిస్తామని చెప్పారు. మరి ఇప్పటివరకు దానికి స్వేత పత్రం విడుదల చేసింది లేదు. మరి ఆ రోజు ఎందుకు మీరు లేఖ రాయలేదు. కాపు రిజర్వేషన్ గురించి ఎక్కడా కూడా ఇప్పటివరకు ప్రస్తావన జరగలేదు. దాని గురించి ఎందుకు మీరు లేఖ రాయలేదు. వైసీపీ వాళ్లు మాట్లాడితే వేదాంతలు, మా అధినేత మాట్లాడితే బూతులా, ఆడపడుచులపై, వీర మహిళలపై ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వైసిపి ఎమ్మెల్యే కించపరిచే విధంగా మాట్లాడి ఎన్నో ఇబ్బందులు పెడితే, మరి ఆరోజు ఎందుకు మీరు లేఖ రాయలేదు. ఇంకా చాలించు ముద్రగడ గారు మీ ముసుగు రాజకీయం, మీరు మీ స్వలాభం కోసం, మీరు ఏదైతే తునిలో ఉప్మా పెట్టిచ్చాడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉద్యమంలో అని చెప్పారు. ఆ ఉప్మాకి అయిన ఖర్చులో భాగంగా మేము కూడా సర్వేపల్లి నియోజకవర్గం నుంచి ఒక్కొక్కరు పది రూపాయల లెక్కన మీకు పోస్ట్ ద్వారా పంపిస్తున్న స్వీకరించండి. అంటే ఎప్పుడు కూడా ముసుగేసుకుని రాజకీయాలు చేయబాకండి, నీతి నిజాయితీగా ఇకనైనా సరే ఇంత వయసు వచ్చింది కళ్ళు తెరిచి కాపులకి మీరేం చేశారు. ప్రభుత్వం ఏం చేసింది మరి ఎందుకు చేయలేకపోయింది అనేటువంటి విషయాల మీద మాత్రమే మాట్లాడండి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారికి లేఖలు రాయడం మీద ఉన్న శ్రద్ధ బూతులు మాట్లాడే మంత్రులకు ఎందుకు రాయలేదయ్యా, ఎమ్మెల్యేలకు ఎందుకు రాయలేదయ్యా అంటే అవి మీకు బూతులుగా వినిపించడం లేదా ఇకనైనా చాలించండి. కృష్ణా రామా అనుకుంటూ ప్రశాంతంగా ఉండండి అంతేకానీ బురదజల్లే పనులు చేయబాకండి. ప్రశాంత్ కిషోర్, వైయస్ జగన్ మోహన్ రెడ్డి లాంటి వాళ్ళ ఎలా చెప్తే అలా ఆడే పరిస్థితిలో ఉన్నట్టున్నారు. మీ ఆటలు ఇంకా సాగవు. జగన్మోహన్ రెడ్డి ఊబిలో చిక్కుకొన్న మీరు చివరకు కాపు ద్రోహిగా నిలవకండి. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు పినిశెట్టి మల్లికార్జున్, రహీం, ఖాజా, శ్రీహరి, మస్తానయ్య, వాసు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com