Logo
Date of Publish : 24 October 2022, 4:05 pm
Editor : Sake Naresh

నరవ గ్రామంలో జనసైనికుడి కుటుంబానికి రూ. 25,000 ఆర్థిక భరోసా

          పెందుర్తి ( జనస్వరం ) : నియోజకవర్గం, 88 వార్డ్, నరవ గ్రామంలో జనసేన పార్టీ కుటుంబ సభ్యుడైన పట్నాల శివకి వారం రోజుల క్రితం అనారోగ్యం బారిన పడటం వలన వారి కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ చేసి సుమారు 1 లక్ష 50 వేల రూపాయలు అప్పుచేసి చికిత్స చేయించడం జరిగింది. జరిగిన విషయాన్ని స్థానిక జనసేన పార్టీ నాయకులు దృష్టికి రాగానే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో వారి కుటుంబాన్ని పరామర్శించి మీకు ఎల్లవేళలా నరవ జనసేన పార్టీ కుటుంబం అండగా ఉంటుంది అని భరోసా ఇచ్చారు. 25 వేల రూపాయలు ఆర్థిక భరోసా కూడా ఇవ్వడం జరిగింది. మీకు భవిష్యత్తులో ఎటువంటి అవసరం ఉన్న మీకు మేము అండగా ఉంటాం మీ సమస్యను మా దృష్టికి తీసుకుని రండి అని ధైర్యం ఇవ్వడంని జనసేన నాయకులు హామీ ఇవ్వడం జరిగింది. ఈ ఆర్థిక భరోసా నరవ జనసేన పార్టీ కుటుంబ సభ్యులు అందరి సహకారంతో జరిగిందని, ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది. కార్యక్రమంలో స్థానిక నాయకులు గళ్ళ శ్రీనివాసరావు, వబ్బిన జనార్ధన శ్రీకాంత్, సాలాపు కనకరాజు, సాలాపు అప్పారావు గోపిశెట్టి ప్రవీణ్, పట్నాల శివ, బొబ్బర శ్రీను, బొడ్డు నాయుడు, బొండా రవి బాబు, రాడి పెంటారావు, మరియు జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com