మాడుగుల నియోజకవర్గంలో జనసేనాని జన్మదిన సందర్భంగా 500 మాస్కులు పంపిణీ, 6వేల మొక్కలు నాటిన జనసైనికులు
మాడుగుల నియోజకవర్గంలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను జనసైనికులు నిర్వహించారు. ఖండివరం గ్రామంలో సహాయ ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ బొయిదాపు కిరణ్ ఆధ్యర్యంలో మాడుగుల నియోజకవర్గంలో 6వేల మొక్కల పంపిణీకి జనసైనికులు ఏర్పాటు చేశారు. ఖండివరం గ్రామంలో 300 మొక్కలు నాటారు. 500 మందికి మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సహాయ ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ బొయిదాపు కిరణ్ మాట్లాడుతూ రైతులకు ఉపయోగకరమైన జామ, ఉసిరి, బొప్పాయి, పనస, దానిమ్మ, కరివేపాకు వంటి మొక్కలను పంపిణీ చేశామని, రానున్న రోజుల్లో తమ ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవా కార్యాక్రమాలను చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనాధు విజయ్, కె. త్రీనాధ్, రెడ్డి స్వామి, రామకృష్ణ, రాజు, గ్రామ ప్రజలు, జనసైనికులు, తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com