నెల్లిమర్ల ( జనస్వరం ) : మధుపాడ, సతివాడ కల్లలు గ్రామాలలో నెలిమర్ల నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ లోకం మాధవి ఇంటి ఇంటికి జనసేన కార్యక్రమం లో గ్రామ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటూ జనసేన సిద్ధాంతాలు మరియు మ్యానిఫెస్టోని వివరించడం జరిగింది. వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభుత్వ స్థాపన కృషి చేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజలు వాళ్ళ యొక్క సమస్యలు తెలియజేస్తూ ప్రభుత్వాలు మారిన మాకు రోడ్డు వేయటం లేదని కనీసం వీధి దీపాలు కూడా లేవని అన్నారు. ఈ సమస్యని ఎవరికి చెప్పాలో తెలియక అయోమయ స్థితిలో, ప్రస్తుతం ఉన్న నాయకులకు మా ఊరు ఒకటి ఉంది అని కూడా గుర్తించటం లేదని అన్నారు. గత ఐదేళ్లలో ప్రభుత్వ అధికారులు కానీ నాయకులు కానీ మా ఊరికి వచ్చి మా సమస్యలు తెలుసుకోలేదు. ఎటువంటి ఉపయోగకరమైన వసతులు కల్పించలేదని గ్రామ ప్రజలు లోకం మాధవి గారి దగ్గర వాపోయారు. అదేవిధంగా సత్తి వాడకల్లాలలో లోకం మాధవి గారు రైతులతో చర్చించడం జరిగింది. వాళ్లకు జరిగిన పంట నష్టం మరియు రైతు కష్టాలు వాళ్ల సాధక బాధకాలు గురించి తెలుసుకోవడం జరిగింది. ప్రజల సమస్యలు విన్న లోకం మాధవి గారు తప్పకుండా జనసేన ప్రభుత్వం రాగానే రోడ్డు వేయిస్తామని అదేవిధంగా ప్రతి ఇంటికి మంచినీళ్లు కొళాయి వచ్చేలా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు కరుమజ్జి గోవింద్, రామచంద్ర, బద్రి, అశోక్, హైమ, రేవల రమణ, దుర్గసి శేఖర్, లోకేష్, వేణు, జగదీష్, అశోక్ పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com