
ఆదోని ( జనస్వరం ) : ఉపాధి పని చూపడంలో అధికారులు విఫలమయ్యారని జనసేన వీరమహిళ ఎరుకుల పార్వతి అన్నారు. ఉన్న ఊర్లో ఉపాధి లేకపోవడంతో పొట్ట చేతపట్టుకుని ఇతర పట్టణాలకు నగరాలకు తరలిపోతున్నారు. ముఖ్యంగా ఆదోని డివిజన్లోనే కోసిగి ఎమ్మిగనూరు మంత్రాలయం ఆలూరు హోళగుంద కోడుమూరు మండలాల నుంచి ఈ ఏడాది కూడా వలసలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ బెంగళూరు గుంటూరు ముంబైలకు తరలి వలస వెళుతున్నారు. కొంతమంది వారి పిల్లలను కూడా తీసుకుని వెళుతున్నారు. మండలాల్లో స్థానికంగా పనులు లేకపోవడంతో ఉపాధి కోసం దూర ప్రాంతాలకు పట్టణాలకు వలస వెళుతున్నారన్నారు. అధికారులు మాత్రం వలసలు వెళ్ళవద్దు గ్రామాల్లో ఉపాధి పనులు కల్పిస్తామని చెబుతున్నారే తప్ప పూర్తిస్థాయిలో వలసలు నివారించడంలో విఫలమయ్యారని ఆవేదన వ్యక్తపరిచారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి గ్రామాల్లోని ఉపాధి కల్పించే వలసలు నివారించాలని అన్నారు.