పిఠాపురం ( జనస్వరం ) : నియోజకవర్గంలోని యు.కొత్తపల్లి మండలం కొండెవరం గ్రామంలోని జనసేన నాయకులు గాది కొండబాబు అధ్యక్షతన జనసేన పార్టీలోకి భారీ చేరికలు జరిగాయి. ఈ చేరికలు నియోజకవర్గ ఇంచార్జీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ చేతులు మీదుగా పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. తొలుత కొండెవరం గ్రామం మొదలు శివారు వరకూ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ భారీ పాదయాత్రగా నడిచి ప్రతీ ఒక్క కుటుంబాన్నీ పలకరించారు. ఈ ర్యాలీలో మహిళలు ఆయనకు ఘన స్వాగతం పలికి అడుగడుగునా నీరాజనాలు పలికి హారతులు పట్టి, విజయ తిలకం దిద్దారు. అనంతరం ఎస్.వి.ఆర్.గార్డెన్స్‌లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న జనసేన నియోజకవర్గ ఇంచార్జీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ చేతుల మీదుగా మహిళలు జనసేనపార్టీ సిద్ధాంతాలను, ఆశయాలను ఇష్టపడి కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పురుషులతో పాటు సమానంగా మహిళలు కూడా సుమారు 1500 మందికి పైగా ఉదయ్ శ్రీనివాస్ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. నూతనంగా పార్టీలోకి జాయిన్ అయ్యిన ప్రతీ ఒక్కరూ నియోజకవర్గంలో పార్టీ జెండా ఎగిరేలా కృషి చేసి ఉదయ్‌ని నెగ్గించుకుంటాం అని ముక్తకంఠంతో అన్నారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామం అంతా జనసేనపార్టీకి జై కొట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది అన్నారు. నియోజకవర్గంలో ఏ గ్రామంలో చేరికలు జరిగినా గ్రామం అంతా ఏకమై, మహిళలు పురుషులతో సమానంగా జనసేన పార్టీకి మద్దతు ఇవ్వడం హర్షించదగ్గ విషయం అని అన్నారు. రాష్ట్రంలో పిఠాపురం నియోజకవర్గంను అభివృద్ధిలో ముందు పెట్టే బాధ్యత నాది అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ జనసేన పార్టీ శ్రేణులు, రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి కిరణ్, నియోజకవర్గ జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలలు మరియు స్థానికలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com