పాలకొల్లులో ఆశావర్కర్లను సన్మానించి, నిత్యావసర సరుకులు అందజేసిన జనసైనికులు
జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా యలమంచిలి మండలం మేడపాడు, బాడవ మరియు పోడూరు మండలం మట్టపర్రు, గంపబోయిన గురువు గ్రామాలలో పాలకొల్లు నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ గుణ్ణం నాగబాబు గారి ఆధ్యక్షతన కరోనాపై పోరాడుతున్న ఆశావర్కర్లను సన్మానించి నిత్యావసర వస్తువులు, కూరగాయలు, గ్రామస్థులకు మొక్కలు పంపిణీ చేసారు. తదనంతరం జనసైనికుల ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యలమంచిలి మండల, పాలకొల్లు మండల అధ్యక్షులు కొడవటి వరబాబు, విప్పర్తి ప్రభాకర్ గార్లు,పోడూరు మండల ప్రధాన కార్యదర్శి బండారు రాజేష్ నాయకులు తులా రామలింగేశ్వరావు, అబ్దుల్ మీరా వలి షేక్, కొమ్ముల దినేష్, విన్నకోట గోపి, యర్రంశెట్టి నరసింహారావు, సతీష్ మరియు నియోజకవర్గ జనసైనికులు పాల్గొన్నారు.