Logo
Date of Publish : 17 January 2024, 11:58 pm
Editor : Sake Naresh

గాజువాక లో.. వైసిపి నుంచి జనసేన పార్టీలోకి భారి చేరికలు

     గాజువాక ( జనస్వరం ) : రాష్ట్ర భవిష్యత్తుకు, యువతకు మార్గం చూపగలిగే నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ మాత్రమేనని నమ్మి ఈ రోజు గాజువాక నియోజకవర్గం నుంచి వైసిపి పార్టి నచ్చి గాజువాక నియోజకవర్గం 70వ వార్డు వైసిపి అధ్యక్షులు కురిటి వెంకట సూరిబాబు గారు, వారి అనుచరులు సుమారు 150 మంది పార్టీ PAC సభ్యులు, నియోజకవర్గ ఇంచార్జి కోన తాతారావు ఆధ్వర్యంలో చేరారు. వైసిపి ఆవిర్భావం నుంచి పార్టీలో పనిచేస్తున్నామని, వార్డులో ప్రజలకు ఉపయోగ పడే పనులు ఆశించిన స్థాయిలో చేయలేక పోయామని ఆవేదనతో వైసిపి పార్టీని వీడి జనసేనలో చేరామని సూరిబాబు అన్నారు. జనసేన పార్టీ విధి విధానాలు, ప్రజల సమస్యలపై పోరాడుతున్న తీరు, ప్రజల శ్రేయస్సు కోసం అండగా నిలబడుతున్న జనసేన పార్టీ లో చేరడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. వార్డు అధ్యక్షులు శ్రీమతి లంకల మురళి దేవి గారు మాట్లాడుతూ గాజువాకలో జనసేన - టిడిపి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుతుందని, దీనికి సంకేతమే గాజువాక నియోజకవర్గం వైసిపి ఇంచార్జ్ గా ఉన్న వార్డు నుంచి జనసేన లోకి చేరికలని అన్నారు. కోన తాతారావు మాట్లాడుతూ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అవసరమని భావించి ప్రజలు రాబోయే ఎన్నికల్లో జనసేన, టిడిపి ఉమ్మడి నాయకత్వానిక అధికారమివ్వాలనే ఆలోచనతో ప్రజలు ఉన్నారని, దాంట్లో భాగమే ఇతర పార్టీల నుంచి జనసేన తీర్థం తీసుకుంటున్నారని వీరికి పార్టీలో సముచితమైన స్థానం ఇచ్చి గౌరవం ఇస్తామన్నారు. వార్డు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీమతి లంకల మురళీదేవి, పార్టీ నాయుకులు కర్రి శ్రీకాంత్,సాయి తదితరులు సమక్షంలో చేరికలు జరిగాయి. జాయిన్ అయినా వారిలో ముఖ్యలు జి. గోవింద, వి. నర్సింగరావు, టి. అప్పారావు, జి. రాంబాబు, ఎస్ శ్రీను, ఎస్ చిరంజీవి,ఎస్ భవాని, అప్పారావు, ఉమా మహేశ్వర రావు, గిన్న బుజ్జి, డి సత్యనారావు, ఆర్ రమణ, సిహెచ్ జగదీష్, పి వినోద్ లున్నారు.

All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com