Logo
Date of Publish : 14 September 2023, 11:13 pm
Editor : Sake Naresh

గజపతినగరం నియోజకవర్గంలో పల్లె పల్లెకు జనసేన పార్టీ

    గజపతినగరం ( జనస్వరం ) : పల్లె పల్లెకు జనసేన పార్టీ కార్యక్రమంలో భాగంగా గజపతినగరం నియోజకవర్గం, దత్తిరాజేరు మండలం,ఎస్. బూర్జవలస గ్రామంలో జనసేన పార్టీ గజపతినగరం నియోజకవర్గ నాయకులు మర్రాపు సురేష్ గారు పర్యటించారు. ప్రతీఇంటింటికి వెళ్లి జనసేన సిద్ధాంతాలతో కూడియున్న కరపత్రాలను పంచుతూ ప్రజలందరికి అధికారం లేకపోయినా పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు చేస్తున్న రైతు భరోసా సాయం, ప్రజల సమస్యలు తీర్చడానికి ప్రజావాణి కోసం మొదలగు సేవలను ప్రజలకు వివరించారు.
గ్రామస్తులు బొట్లు పెట్టి, హరతులతో జనసేన నాయకులకు నీరాజనాలు పలికారు. ఈ సందర్బంగా నాయకులు సురేష్ మాట్లాడుతూ మన బడుగు బలహీన వర్గాల జీవితాలను మార్చడానికి వచ్చిన నిస్వార్థ ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని, ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుతో ఈసారి నిజాయితీతో పార్టీ పెట్టిన జనసేన అభ్యార్థులకు వేసి గెలిపించిమని అభ్యర్థిస్తున్నామని, ఖచ్చితంగా రాష్ట్రంలో జెండా మారితే సామాన్యుల బతుకులు మారడం ఖాయమని అన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా సీనియర్ నాయకులు డా.మిడతాన రవికుమార్,దత్తిరాజెరు మండల నాయకులు భాస్కర్ రావు,లోకేష్,చరణ్, అనిల్,సూర్య,సురేష్,అశోక్, లక్ష్మీనారాయణ, గజపతినగరం మండలం నాయకులు కలిగి పండు, కే.శ్రీను,ఆదినారాయణ,మహేష్,శంకర్,చలం,హేమ సుందర్,శ్రీను, జన సైనికులు కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com