తూర్పుగోదావరి జిల్లాలో ఎలక్షన్ జోరు ముగిసింది. మున్సిపల్ ఎన్నికల్లో ఈసారి అధిక శాతం మహిళలకు రిజర్వేషన్లు దక్కడంతో జనసేన పార్టీ తరుపున కాకినాడ వీరమహిళా విభాగం తరుపున కాకినాడ మాజీ మేయర్, పార్టీ రాష్ట్ర లోకల్ బాడీ ఎలక్షన్ కమిటీ మెంబెర్ పోలసపల్లి సరోజ, జిల్లా వీరమహిళలతో కలిసి బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసిన సామర్లకోట, పెద్దాపురం, పిఠాపురం, గొల్లప్రోలు, అమలాపురంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సరోజ మాట్లాడుతూ అధికార పార్టీ ఇతర పార్టీలు ఎన్నో ఒత్తిళ్లు కలిగించినా ఎదుర్కొని నిల్చున్న మహిళా అభ్యర్థులను అభినందించారు. నేడు జరగనున్న ఎన్నికల్లో అధికశాతం ప్రజలు ఓటింగ్ లో పాల్గొనాలన్నారు. నిన్నటి వరకూ నిర్వహించిన రోజు వారి ప్రచారాల్లో వీరమహిళలు అందరూ ప్రచారాలు చేస్తూ సహకారాలు అందిస్తూ తమదైన శైలిలో ఎన్నికల పర్వాన్ని ముందుకు నడిపిస్తూ అలాగే 80 సంవత్సరాల వృద్ధురాలు పోటీలో నిల్చున్నారు అంటే అది తమ అధినేత పవన్ కళ్యాణ్ నింపిన స్పూర్తితోనే సాధ్యం, ఆ స్పూర్తితోనే విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.