● వైసీపీకి భారీ షాక్, వైసిపిపార్టీ నుండి 100 కుటుంబాలు జనసేనలో చేరిక
● టీడీపీ నుండి 50 కుటుంబాలు జనసేనలో చేరిక
దొర్నిపాడు, (జనస్వరం) : ఆళ్ళగడ్డ నియోజకవర్గం, దొర్నిపాడు మండలం, క్రిష్టిపాడు గ్రామం వైసీపీపార్టీకి చెందిన వార్డు మెంబర్ గా గెలుపొందిన కట్టుబడి మహబూబ్ దౌల జనసేన పార్టీలో చేరారు. అలాగే వైసీపీ పార్టీకి చెందిన 100 కుటుంబాలు, టిడిపి పార్టీకి చెందిన 50 కుటుంబాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సోదరుల కుటుంబాలు జనసేనపార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి ఆళ్ళగడ్డ జనసేన నాయకులు మైలేరి మల్లయ్య సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. అనంతరం మైలేరి మల్లయ్య మీడియాతో మాట్లాడుతూ జనసేనపార్టీలో చేరిన సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. మార్పు కోసం మీ అందరూ జనసేనపార్టీలో చేరడాన్ని ఆళ్ళగడ్డ రాజకీయాలలో మార్పు కోరుతున్నార అన్న దానికి నిదర్శనం ఇంత మంది జనసేనపార్టీలో చేరడమే అని తెలియజేశారు. జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆత్మహత్య చేసుకున్న అటువంటి కౌలు రైతు కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయలు అందించారని, ప్రజా సమస్యల మీద అలుపెరగని పోరాటం చేస్తున్నారని, నీతి, నిజాయితీ నిబద్ధత గల నాయకుడు వెంట ఆళ్లగడ్డ నియోజకవర్గం ప్రజలు నడవాలని కొత్తతరం చదువుకున్న యువత, పెద్దలు, బడుగు, బలహీన వర్గాల రాజ్యాధికారమే దిశగా పని చేస్తున్నటువంటి జనసేన పార్టీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో వైసీపీ టిడిపి పార్టీల నుండి భారీ చేరికలు ఉంటాయని తెలియజేశారు. జనసేనపార్టీలో చేరిన ప్రతి కుటుంబానికి జనసేనపార్టీ, పవన్ కళ్యాణ్, నేను అండగా ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు షబ్బీర్ బాషా, నీలి వెంకటేశ్వర్లు, సిల్ల సీలయ్య, బండి సుబ్బయ్య, పగడాల నాగరాజు, దురువేసుల కృష్ణ, చాకలి నరసింహ, దురువేసుల ప్రతాప్, మునిగింస గారి నన్నేబై, తిరుపెంగళ్ల ఓబుళపతి, పెద్ద ఓబుళపతి, మద్దిలేటి యాదవ్, తులసి, తిమ్మరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com