
ధర్మవరం, (జనస్వరం) : జనసేన పార్టీ అధ్యక్షులు గౌ. శ్రీ. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్దాంతలు నచ్చి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ధర్మవరం నియోజకవర్గ ఇంఛార్జ్ శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మండలంలోని గొట్లూరు గ్రామానికి చెందిన 10 కుటుంబాల ప్రజలు జనసేన పార్టీలోకి చేరడం జరిగింది. వారందరికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా మధుసూదన్ గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్దాంతలు నచ్చి జనసేన పార్టీలోకి చేరడం మంచి శుభపరిణామము అని అన్నారు. వైసిపి ప్రభుత్వముపై రాష్ట్ర ప్రజలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు అని అన్నారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఆశయాలు, సిద్దాంతలును ప్రజల్లోకి తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడమే లక్ష్యంగా పని చేయాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమములో జనసేన నాయకులు మరియు జనసైనికులు తదితురులు పాల్గొన్నారు.