Logo
Date of Publish : 16 June 2021, 2:22 pm
Editor : Sake Naresh

బాపట్ల నియోజకవర్గం లో ప్రభుత్వం పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాల మంజూరు అంశంపై విచారణ చేపట్టాలి.గుంటుపల్లి తులసి కుమారి

           ఇప్పటికే బాపట్ల నియోజకవర్గంలో పేదలకు పంపిణీ చేసే ఇళ్ల స్థలాలు విషయంలో అవకతవకలు జరిగాయని జనసేన పార్టీ తరఫున పలుమార్లు ప్రభుత్వ అధికారులను అడగడం జరిగింది అని గుంటుపల్లి తులసి కుమారి గారు అన్నారు. అర్హులైన వారిని అనర్హులైన వారి లిస్టును పబ్లిక్ గా పెట్టవలసిందిగా కోరగా ఇంతవరకు ఎలాంటి లిస్టు ఇవ్వకపోవడం ఆశ్చర్యం అయితే నిన్న కర్లపాలెం లో జరిగిన సంఘటన చాలా బాధాకరం. మాకు అర్హత ఉన్నా గానీ ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని ప్రజలు వీఆర్వో ఆఫీస్ ఎదురు బైటాయించడం చూస్తుంటే అవకతవకలు ఎంత మేర జరిగాయో అర్థమవుతుంది. మా జనసేన పార్టీ నాయకులు ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చిన స్థలాల దగ్గరికి వెళ్లి సందర్శించడం జరిగింది. ఆస్తిపరులకు సైతం రికమండేషన్తో ఇళ్ల స్థలాలు వచ్చినట్లుగా గుర్తించడం జరిగింది. ఉన్నతాధికారులు వెంటనే ఇచ్చిన స్థలాలన్నీ పున పరిశీలించి అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాము. కర్లపాలెం VRO  గారు భాషను మార్చు కుంటే మంచిదని సూచించడం జరిగింది. తప్పు జరగకపోతే అంత కోపం ఎందుకు VRO  గారు తను సస్పెండ్ అయితే విలేకరి అంతు చూస్తా అని,  విలేకరిపై దాడి చేస్తానని, తనకు పలుకుబడి ఉందని అనటం తీవ్రంగా ఖండించడం జరిగింది. బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఇళ్ల స్థలాలు మంజూరు విషయంలో జరిగిన అవకతవకలుకు అధికార పార్టీ చోటా నాయకుల అండదండలు కూడా ఉన్నాయని వారి ఒత్తిడి వల్ల అనర్హులైన వాళ్లకి ఇవ్వాల్సి వస్తుందని కొంతమంది సచివాలయ సిబ్బంది చెప్పడం జరిగింది. కావున ఎమ్మెల్యే గారు ప్రత్యేక దృష్టి పెట్టి అవకతవకలు సరిచేసి అర్హులైన వారికి ఇళ్ల పట్టాలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ  తరుపున డిమాండ్ చేయడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com