ఇప్పటికే బాపట్ల నియోజకవర్గంలో పేదలకు పంపిణీ చేసే ఇళ్ల స్థలాలు విషయంలో అవకతవకలు జరిగాయని జనసేన పార్టీ తరఫున పలుమార్లు ప్రభుత్వ అధికారులను అడగడం జరిగింది అని గుంటుపల్లి తులసి కుమారి గారు అన్నారు. అర్హులైన వారిని అనర్హులైన వారి లిస్టును పబ్లిక్ గా పెట్టవలసిందిగా కోరగా ఇంతవరకు ఎలాంటి లిస్టు ఇవ్వకపోవడం ఆశ్చర్యం అయితే నిన్న కర్లపాలెం లో జరిగిన సంఘటన చాలా బాధాకరం. మాకు అర్హత ఉన్నా గానీ ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని ప్రజలు వీఆర్వో ఆఫీస్ ఎదురు బైటాయించడం చూస్తుంటే అవకతవకలు ఎంత మేర జరిగాయో అర్థమవుతుంది. మా జనసేన పార్టీ నాయకులు ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చిన స్థలాల దగ్గరికి వెళ్లి సందర్శించడం జరిగింది. ఆస్తిపరులకు సైతం రికమండేషన్తో ఇళ్ల స్థలాలు వచ్చినట్లుగా గుర్తించడం జరిగింది. ఉన్నతాధికారులు వెంటనే ఇచ్చిన స్థలాలన్నీ పున పరిశీలించి అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాము. కర్లపాలెం VRO గారు భాషను మార్చు కుంటే మంచిదని సూచించడం జరిగింది. తప్పు జరగకపోతే అంత కోపం ఎందుకు VRO గారు తను సస్పెండ్ అయితే విలేకరి అంతు చూస్తా అని, విలేకరిపై దాడి చేస్తానని, తనకు పలుకుబడి ఉందని అనటం తీవ్రంగా ఖండించడం జరిగింది. బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఇళ్ల స్థలాలు మంజూరు విషయంలో జరిగిన అవకతవకలుకు అధికార పార్టీ చోటా నాయకుల అండదండలు కూడా ఉన్నాయని వారి ఒత్తిడి వల్ల అనర్హులైన వాళ్లకి ఇవ్వాల్సి వస్తుందని కొంతమంది సచివాలయ సిబ్బంది చెప్పడం జరిగింది. కావున ఎమ్మెల్యే గారు ప్రత్యేక దృష్టి పెట్టి అవకతవకలు సరిచేసి అర్హులైన వారికి ఇళ్ల పట్టాలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేయడం జరిగింది.