Logo
Date of Publish : 24 September 2022, 10:17 am
Editor : Sake Naresh

ఆత్మకూరు నియోజకవర్గంలో కనీస వసతులు లేక అల్లాడుతున్న విలీన గ్రామాల ప్రజలు

      ఆత్మకూరు, (జనస్వరం) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేయాలన్న దృడసంకల్పంతో తలపెట్టిన పవనన్న ప్రజాబాట ఈరోజు ఆత్మకూరు మున్సిపల్ పరిధిలో 14వ రోజుకు చేరుకుంది. ఈరోజు మున్సిపాలిటీ పరిధిలోని పేరారెడ్డి పల్లె గ్రామంలో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గ ఇంఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ ఆత్మకూరు పట్టణాన్ని మున్సిపాలిటీగా మార్చే క్రమంలో జనాభా తక్కువ కావడంతో, నెల్లూరు పాలెం, వెంకట్రావుపల్లి గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేయడం జరిగింది. మున్సిపాలిటీ ఏర్పడి పుష్కరకాలం దాటినప్పటికి, విలీన పంచాయతీల, గ్రామాలైన నెల్లూరు పాలెం, వెంకట్రావుపల్లి, పేరారెడ్డిపల్లి, అల్లిపురం, ముస్తాపురం, జాలయ్య నగరం, శాంతి నగరం, నర్సాపురం గ్రామాల్లో నేటికీ కనీస వసతులైన తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ ప్రాంతాలన్నీ ఇప్పటికీ పల్లెలలాగే ఉన్నాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, పాలకులు ఈ గ్రామాలపై శ్రద్ధచూపి కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని జనసేనపార్టీ తరఫున ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ ఆత్మకూరు మున్సిపాలిటీ సకల సౌకర్యాలతో, ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలంటే, జనసేనపార్టీకి ఓటు వేసి పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేసుకోవాలని తెలిపారు. పవన్ అన్న ప్రజా బాట 14వ రోజు సందర్భంగా స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని అక్కడికి ప్రజలకు భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సురేంద్ర, వంశీ, చంద్ర,పవన్, నాగరాజు, అనిల్, భాను, హజరత్ తదితరులు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com