గుంటూరు ( జనస్వరం ) : వేమూరు నియోజవర్గం చుండూరు మండలం మోదుకూరు గ్రామంలో దేవి నవరాత్రుల్లో సందర్భంగా ప్రభలు ఏర్పాటు చేసుకొని అమ్మవారి విగ్రహాన్ని ఊరేగిస్తున్నారు. ఈ సందర్భంలో అధికార పార్టీ నాయకులు ఓర్వలేక జనసైనికులపై ఏదో ఒక వంకతో పోలీసులు చేత ఒత్తిడి తీసుకురావటం ప్రతి విషయంలో ఏదో ఒక ఆటంకం కలిగించటం జరుగుతోందని జనసేన నాయకులు అన్నారు. జనసేన పార్టీ వారు తిరణాళ్ళలో పాల్గొనకూడదని, మేము ముందే పోలీస్ వారి నుంచి అన్ని పర్మిషన్స్ తీసుకున్న మాపై ఏదో ఒక రకమైన ఒత్తిడి తీసుకురావడం జరిగిందని అన్నారు. పోలీస్ వారు నిన్నటి నుంచి ఉదయాన్నే మమ్మల్ని స్టేషన్కి పిలిపించటం సాయంత్రం దాకా కూర్చోబెట్టటం అలానే ఈరోజు కూడా ఉదయాన్నే పిలిపించటం జరిగింది. ఈ విషయాన్ని ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి సోమారౌతు అను రాధ ఫోన్ చేసి తెలుపగా వారు పోలీస్ స్టేషన్ కి వచ్చి సిఐతో, డిఎస్పితో మాట్లాడి అందరిని బయటికి తీసుకువచ్చి పంపించడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com