Logo
Date of Publish : 24 October 2023, 8:16 pm
Editor : Sake Naresh

వైసీపీ ప్రభుత్వం వారు ప్రతిపక్షాల గొంతు నొక్కేయటం ఎన్నాళ్లో మేము చూస్తాం

          గుంటూరు ( జనస్వరం ) : వేమూరు నియోజవర్గం చుండూరు మండలం మోదుకూరు గ్రామంలో దేవి నవరాత్రుల్లో సందర్భంగా ప్రభలు ఏర్పాటు చేసుకొని అమ్మవారి విగ్రహాన్ని ఊరేగిస్తున్నారు.  ఈ  సందర్భంలో అధికార పార్టీ నాయకులు ఓర్వలేక జనసైనికులపై ఏదో ఒక వంకతో పోలీసులు చేత  ఒత్తిడి తీసుకురావటం ప్రతి విషయంలో ఏదో ఒక ఆటంకం కలిగించటం జరుగుతోందని జనసేన నాయకులు అన్నారు. జనసేన పార్టీ వారు తిరణాళ్ళలో పాల్గొనకూడదని, మేము ముందే పోలీస్ వారి నుంచి అన్ని పర్మిషన్స్ తీసుకున్న మాపై ఏదో ఒక రకమైన ఒత్తిడి తీసుకురావడం జరిగిందని అన్నారు. పోలీస్ వారు నిన్నటి నుంచి ఉదయాన్నే మమ్మల్ని స్టేషన్కి పిలిపించటం సాయంత్రం దాకా కూర్చోబెట్టటం అలానే ఈరోజు కూడా ఉదయాన్నే పిలిపించటం జరిగింది. ఈ విషయాన్ని ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి సోమారౌతు అను రాధ  ఫోన్ చేసి తెలుపగా వారు పోలీస్ స్టేషన్ కి వచ్చి సిఐతో, డిఎస్పితో మాట్లాడి అందరిని బయటికి తీసుకువచ్చి పంపించడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com