Logo
Date of Publish : 02 August 2022, 3:33 pm
Editor : Sake Naresh

రాజకీయం ఉపాధిగా మారిన నేటి తరానికి ఆదర్శం అమరజీవి పింగళి వెంకయ్య

        విజయనగరం ( జనస్వరం ) : భారత జాతీయ త్రివర్ణ పతాక రూపకర్త, స్వాతంత్ర్య సమరయోధులు పింగళి వెంకయ్య 146వ జయంతి సందర్బంగా మంగళవారం ఉదయం,స్థానిక బాలాజీ జంక్షన్ వద్దనున్న అంబేద్కర్ సామాజిక భవనంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా పింగళి వెంకయ్య చిత్రపటానికి జనసేన పార్టీ నాయకులు ఆదాడ మోహనరావు, త్యాడ రామకృష్ణారావు(బాలు) పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాగాయకులు ఆదాడ మోహనరావు మాట్లాడుతూ రాజకీయం ఉపాధిగా మారిన నేటి తరానికి నిస్వార్థమే ఊపిరిగా బతికిన అమరజీవి పింగళి వెంకయ్య ఆదర్శమని, భారత దేశం తలెత్తుకునే విధంగా భారతీయుల ఏకత్వానికి, సౌర్యానికి, స్వాభిమానానికి,సార్వాభౌమత్యానికి, సమున్నతికి ప్రతీకైనా ఇటువంటి మహనీయులను వర్ధంతులు, జయంతులప్పుడే ప్రభుత్వాలు తలుస్తాయే తప్ప వట్టిప్పుడు పట్టించుకునే పరిస్థితి లేదని వాపోయారు. ఇటువంటి మహనీయన్ని పవన్ కళ్యాణ్ సందేశం ఇచ్చినట్లు భారతదేశం గర్వించదగ్గ భారత రత్న ఇచ్చి గౌరవించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ ఎస్. మురళీమోహన్, పిడుగుసతీష్, చెల్లూరి ముత్యాల నాయుడు, లోపింటి కళ్యాణ్, దువ్విగూడా రాజేష్,రాము, బూర్లి వాసు,రాజు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com