విజయనగరం ( జనస్వరం ) : భారత జాతీయ త్రివర్ణ పతాక రూపకర్త, స్వాతంత్ర్య సమరయోధులు పింగళి వెంకయ్య 146వ జయంతి సందర్బంగా మంగళవారం ఉదయం,స్థానిక బాలాజీ జంక్షన్ వద్దనున్న అంబేద్కర్ సామాజిక భవనంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా పింగళి వెంకయ్య చిత్రపటానికి జనసేన పార్టీ నాయకులు ఆదాడ మోహనరావు, త్యాడ రామకృష్ణారావు(బాలు) పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాగాయకులు ఆదాడ మోహనరావు మాట్లాడుతూ రాజకీయం ఉపాధిగా మారిన నేటి తరానికి నిస్వార్థమే ఊపిరిగా బతికిన అమరజీవి పింగళి వెంకయ్య ఆదర్శమని, భారత దేశం తలెత్తుకునే విధంగా భారతీయుల ఏకత్వానికి, సౌర్యానికి, స్వాభిమానానికి,సార్వాభౌమత్యానికి, సమున్నతికి ప్రతీకైనా ఇటువంటి మహనీయులను వర్ధంతులు, జయంతులప్పుడే ప్రభుత్వాలు తలుస్తాయే తప్ప వట్టిప్పుడు పట్టించుకునే పరిస్థితి లేదని వాపోయారు. ఇటువంటి మహనీయన్ని పవన్ కళ్యాణ్ సందేశం ఇచ్చినట్లు భారతదేశం గర్వించదగ్గ భారత రత్న ఇచ్చి గౌరవించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ ఎస్. మురళీమోహన్, పిడుగుసతీష్, చెల్లూరి ముత్యాల నాయుడు, లోపింటి కళ్యాణ్, దువ్విగూడా రాజేష్,రాము, బూర్లి వాసు,రాజు తదితరులు పాల్గొన్నారు.