ఆమదాలవలస వరద వారి క్వాటర్స్ కు చెందిన B.మల్లేశ్వరరావు గారికి ఇటివలే ఒంటిలో రక్తం సరిపడక అనారోగ్యంతో హాస్పిటల్లో చేరగా ఈ విషయం తెలుసుకున్న వెంగళరావు కాలనీ జనసైనికులు, ఆమదాలవలస జనసేనా పార్టీ ఇంఛార్జి పేడాడ రామ్మోహన్ గారు దృష్టికి తీసుకెళ్ళారు. ఆయన వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి సరిపడా నాలుగు రక్తం ప్యాకెట్స్ దానం చేయడంతో పాటు ఆర్థికంగా కుటుంబానికి సహాయం చేయడం జరిగింది. జనసైనికులు హాస్పిటల్ డాక్టర్స్ ను మల్లేశ్వరరావు గారి ఆరోగ్య సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అతని కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది. శ్రీను, గణేష్, వెంకటేష్ రక్త దానం చేశారు. ధనుంజయ, గణేష్, వెంకటేష్, శ్రీను, వెంకీబాబు, సింహాచలం, బాలు, సాయి ఆర్థిక పరంగా ఆదుకున్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com