అనంతపురం ( జనస్వరం ) : గత ఐదు రోజులుగా మాండౌన్ తుఫాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా నష్టపోయిన రైతులందరికీ ప్రతి ఎకరానికి 10వేల రూపాయలు చొప్పున తక్షణ ఆర్థిక సహాయంగా నష్టపరహాన్ని అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు జయరాం రెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ గత ఐదు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా తుఫాను ప్రభావంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు పండిన పంట ఒకవైపు పొలాల్లో పడిపోయి గింజలు మొలకలు ఎత్తిపోతున్నాయి, మరోవైపు కోసిన ధాన్యాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ గోని సంచులు కూడా సరఫరా చేయలేని పరిస్థితిలో రైతు భరోసా కేంద్రాలను నడుపుతుందంటే ఎంత దారుణమైన పరిస్థితులు రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్నాయో అర్థమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సరైన వసతులు కల్పించకపోవడం వలన దాన్యం సరిగా ఆరబెట్టుకోలేక రంగు మారిపోతుంది కేవలం రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా పబ్లిసిటీలు చేసుకొని రైతు భరోసా కేంద్రాలు రైతుల ఆదుకుంటాయని పత్రిక ప్రకటనకు మాత్రమే పరిమితం చేయడం చాలా శోచనీయం హేయమైన చర్య జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మరి ముఖ్యంగా అనంతపురం జిల్లాలో రైతు భరోసా కేంద్రాల సహకారం లేకపోవడం వలన రైతులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. 151 మంది ఎమ్మెల్యేల ఉన్నామని గొప్పగా చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వం ఎమ్మెల్యేలంతా ఎక్కడున్నారు? ఎందుకు రైతులు దగ్గరకు వెళ్లి రైతులకు భరోసా కల్పించడం లేదు? కనీసం రైతులని పలకరించిన పాపాల పోవట్లేదు? ఇప్పటికైనా గొప్పలు మాని రైతుల దగ్గరికి వెళ్లి రైతులకు మనోధైర్యాన్ని కల్పించి భరోసా కల్పించవలసిందిగా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. పని పాట లేని రాష్ట్ర మంత్రులు కేవలం పవన్ కళ్యాణ్ గారి గురించి జనసేన ప్రచార రథం వారాహి గురించి, దాని రంగు గురించి పొద్దుబోని మాటలు మాట్లాడుతూ కాలయాపన చేస్తున్నారు. మరియు ముఖ్యంగా గుడివాడ అమర్నాథ్, రోజా, పేర్ని నాని లాంటివారు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతూ కాలయాపన చేస్తున్నారు. వరాహి జనసేన ప్రచార రథం గురించి, రంగు గురించి మాట్లాడే అంత ఖాళీగా వీళ్ళు ఉన్నారంటే చాలా బాధాకరం. ఇప్పటికైనా రాష్ట్ర మంత్రులు తమ విధులు విధానాలు తెలుసుకొని రాష్ట్రవ్యాప్తంగా తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.