Logo
Date of Publish : 19 March 2022, 3:45 pm
Editor : Sake Naresh

నాటుసారా తాగి మరణించిన బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం అందించాలి : జనసేన నాయకులు గంధంశెట్టి దినకర్ బాబు

     రైల్వేకోడూరు, (జనస్వరం) : జంగారెడ్డిగూడెంలో నాటు సారా తాగి అకాల మరణం పొందిన కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ సహాయం ప్రకటించాలని రైల్వే కోడూరు జనసేన పార్టీ నాయకులు గంధం శెట్టి దినకర్ బాబు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా దినకర్ బాబు మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం నాటుసారా ఘటనపై తెలుగు దేశం రాజకీయం చేస్తే, వైసీపీ ప్రభుత్వం తెలుగుదేశంపై పెగాసన్ విషయంపైన రాజకీయాలు చేస్తున్నారన్నారని తెలిపారు. పాలన వదిలేసి రాజకీయాలు మాత్రం చేస్తున్న అధికార, ప్రతిపక్షాలు నిజమైన చిత్తశుద్ధి, ప్రజల కోసం పనిచేసే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సంధించిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ప్రజాస్వామ్య పద్ధతిలో ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో దేవాలయాలపై, మహిళలపై, దళితులపై జరిగిన దాడులకు ప్రభుత్వం నుండి సమాధానం లేదన్నారు. ప్రభుత్వ తప్పిదాలను ఎండగట్టాల్సిన ప్రతిపక్షం అధికారం లేదని అసెంబ్లీ పైన అలిగి వెళ్లిపోవడం చేతకానితనం అన్నారు. ఇలాంటి నాయకులను ఎన్నుకొని ప్రజలు నిజంగా మోసపోయారు అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి అప్పులు చేయడం తప్ప అభివృద్ధి తెలియదన్నారు. కొన్ని అభివృద్ధి కార్యక్రమాలలో ముఖ్యమంత్రి బటన్ నొక్కుతున్నారేగాని లబ్ధిదారులకు సరైన సమయంలో ఫలాలు అందడం లేదన్నారు. ప్రజలు ఓట్లు వేస్తే ప్రజల కొరకు పని చేయడం లేదన్నారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు ప్రస్తుతం అధికార ప్రతిపక్షాలు అని విమర్శించారు. జంగారెడ్డిగూడెం నాటుసారా మృతులంతా నిరుపేద కుటుంబాలయిన కారణంగా ప్రభుత్వం తక్షణమే స్పందించి తక్షణ సహాయం ప్రకటించాలని కోరారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com