గుంతకల్ ( జనస్వరం ) : శిథిల వ్యవస్థలో గుత్తి - గుంతకల్ ఆర్ అండ్ బి ఫ్లై ఓవర్ బ్రిడ్జి, ఇబ్బంది పడుతున్న సామాన్య ప్రజలు, ప్రమాద నివారణకు వెంటనే చర్యలు తీసుకోవాలి గుత్తి జనసేన పార్టీ ఆధ్వర్యంలో బ్రిడ్జి దుస్థితిని తెలియజేస్తూ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అనంతపురం జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ గారు మాట్లాడుతూ గుత్తి గుంతకల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దయనీయస్థితి గురించి అధికారులకు ఎన్నిసార్లు తెలియజేసిన పట్టించుకోవడంలేదని, ఈ రహదారిలో భారీ వాహనాలు నిత్యం వెళుతూ ఉంటాయి అలాగే ప్రజా ప్రతినిధులు అధికారులు కూడా నిత్యం ప్రయాణిస్తూనే ఉంటారు అయినా కూడా పట్టించుకోకపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. ప్రభుత్వం వాహనమిత్ర పేరుతో ఇస్తున్న 10 వేలు ఆటో మరమ్మతులు కూడా చాలడం లేదని, సరైన రహదారులు, బ్రిడ్జిలు నిర్మిస్తే చాలు అని ఆటో డ్రైవర్లు మొర పెట్టుకుంటున్నారు, పెట్రోలు, డీజిల్ పై సెస్ పేరుతో వందల కోట్లు ప్రభుత్వం దండుకోవడం కాదు, ఇలా శిథిలావస్థకు వచ్చిన రోడ్లు బాగు పై కూడా కాస్త దృష్టి సారించాలని ఇప్పటికైనా గాఢనిద్రలో ఉన్న ముఖ్యమంత్రి, గౌరవ శాసనసభ్యులు నిద్రలేచి జనసేన పార్టీ లేవనెత్తిన సమస్యని హుందాగా స్వీకరించి ఈ రహదారికి మరియు బ్రిడ్జ్ కు శాశ్వత మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గుత్తి మండల, పట్టణ అధ్యక్షులు చిన్న వెంకటేశులు, పాటిల్ సురేష్ పామిడి మండలాధ్యక్షుడు ఎం. ధనుంజయ సీనియర్ నాయకులు బోయగడ్డ బ్రహ్మయ్య, నాగయ్య రాయల్ జిల్లా కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు పవర్ శేఖర్, గుంతకల్ చిరంజీవి యువత అధ్యక్షుడు పాండు కుమార్, గుంతకల్ నియోజకవర్గం సోషల్ మీడియా కోఆర్డినేటర్ సురేష్ కుమార్ నాయకులు వెంకటపతి నాయుడు, ఆటో రామచంద్ర, హేమంత్, గద్దల కార్తిక్, మంజునాథ్, అమర్, ఓబులేసు, నూరు మొహమ్మద్, సందీప్, హరి, షేక్షవలి, ఖాజా శిక్షావలి ఖాజా నిస్వార్థ జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com