Logo
Date of Publish : 11 December 2020, 7:29 am
Editor : Sake Naresh

ఏలూరు ఘటనలాంటివి మన జగ్గయ్యపేటలో జరగకుండా కాలుష్యంపై తక్షణ చర్యలు తీసుకోవాలి : ఈమని కిషోర్

ఏలూరు ఘటనలాంటివి మన జగ్గయ్యపేటలో జరగకుండా కాలుష్యంపై తక్షణ చర్యలు తీసుకోవాలి : ఈమని కిషోర్

                   ఏలూరులో గత 3 రోజులుగా వందలాది మంది ప్రజలు వాంతులు, విరోచనలు, ఆయాసం, అకస్మాత్తుగా సృహ తప్పి పడిపోవడం, మూర్ఛపోవటం లాంటి అనారోగ్య సమస్యలతో ఆసుపత్రులకు రావటం తీవ్ర ఆందోళనకు కలిగించిన విషయం విదితమే. ఏలూరులో వాయు జల కాలుష్యాలు పరిమితికి మించి ఉన్నాయని గతంలో అనేక సర్వేలలో వెల్లడైంది. అయినప్పటికీ సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుందని, అదే విధంగా జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలో, ముఖ్యంగా జగ్గయ్యపేట మండలంలో అనేక రకాల ఫ్యాక్టరీ ల వలన ఇప్పటికే వాయు, జల కాలుష్యం విపరీతంగా పెరిగిపోయాయి అని, తక్షణమై వాటిపై చర్యలు తీసుకోవాలని జగ్గయ్యపేట నియోజకవర్గ జనసేన నాయకులు ఈమని కిషోర్ కుమార్ ఒక పత్రిక ప్రకటనలో తెలియచేసారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మండల పరిధిలో గల స్థానిక ధర్మవరపాడు తండా సమీపములో గల రాంకో సిమెంట్స్ నుంచి వచ్చే దుమ్ము, పొగ వలన ఆ ఫ్యాక్టరీ సమీపంలో గల గ్రామాల ప్రజలు చర్మ వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధ పడుతున్నారని పలు సర్వేలలో కూడా వెల్లడించారు. అదే విధంగా షేరమొహ్మద్ పేట సమీపంలో గల గ్రీన్ టెక్ కెమికల్ ఫ్యాక్టరీ వలన ఇప్పటికే అనేక రకాల వ్యాధులు ప్రభల్లాయి అని, ఫ్యాక్టరీ నుంచి వెలువడిన వ్యర్ధాలు వలన పైప్ లైన్లో నీరు, బోరింగ్ నీరు కలుషితమైపోయాయి అని ఆయన తెలిపారు. ఆటో నగర్ సమీపంలో గల కెమికల్ ఫ్యాక్టరీల వలన మూగ జీవులు కూడా బలైపోయాయని మరి జనవాసాలు తిరిగే మధ్యన ఇలాంటి ఫ్యాక్టరీ ల వలన ఇన్ని ఇబ్బందులు ఉన్నందున మన జగ్గయ్యపేట ని కాలుష్య కోరాల నుంచి రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిది, కావున రాజకీయా నాయకులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు, అధికార యంత్రాంగం అందరూ కలిసిగట్టుగా ముందుకు రావాలని దానికి నియోజకవర్గ జనసేన పార్టీ ఎప్పుడూ కూడా ముందు ఉంటుందని, కాలుష్యం గురించి ఒక నివేదిక తయారుచేసి మా అధ్యక్షుల వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాము అని ఆయన తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com