Logo
Date of Publish : 25 July 2026, 8:08 pm
Editor : Sake Naresh

మెగా యూత్ ఫోర్స్ జిల్లా కన్వీనర్‌గా ఇమామ్ హుస్సేన్

- సుస్మిత కొణిదెల చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్న హుస్సేన్

హైదరాబాద్ (జనస్వరం): మెగా యూత్ ఫోర్స్ జిల్లా కన్వీనర్‌గా నియమితులవడం తన జీవితంలో ఎంతో చిరస్మరణీయమైన ఘట్టమని ఇమామ్ హుస్సేన్ తెలిపారు. హైదరాబాద్‌లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో నిర్వహించిన మెగా యూత్ ఫోర్స్ నియామక కార్యక్రమంలో మెగా ప్రిన్సెస్, మెగా ప్రొడ్యూసర్ సుస్మిత కొణిదెల చేతుల మీదుగా ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా హుస్సేన్ మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి జిల్లా కన్వీనర్ బాధ్యతలు అప్పగించిన మెగా యూత్ ఫోర్స్ నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ బాధ్యతకు వన్నె తెచ్చేలా నిబద్ధతతో పనిచేస్తూ, మెగాస్టార్ చిరంజీవి సేవా స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అభిమానులతో కలిసి మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానని చెప్పారు. మెగా కుటుంబం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు అంకితభావంతో కృషి చేస్తానని, సమాజ సేవనే తన ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతానని పేర్కొన్నారు. అభిమానుల ఆశీస్సులు, సహకారంతో సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపట్టి ప్రజలకు మరింత చేరువయ్యేలా కృషి చేస్తానని హుస్సేన్ తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com