● జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఘంటసాల వెంకటలక్ష్మి
దెందులూరు, (జనస్వరం) : జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనని అడ్డుకోవాలని ఉత్తరాంధ్ర జనసేన నాయకులను కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధించి అజ్ఞాతంలో ఉంచిన పోలీసులు వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ దెందులూరు నియోజకవర్గ జనసేనపార్టీ ఆధ్వర్యంలో దెందులూరు గ్రామంలో ఉన్నటువంటి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర కార్యదర్శి వెంకట్ లక్ష్మి మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగం ఇచ్చిన హక్కులతో విశేష ప్రజాదరణ ఉన్న ప్రతిపక్షంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి విశాఖపట్నంలో చేస్తున్నా జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఎలాంటి తప్పులు చేయనని ఉత్తరాంధ్ర జనసేన నాయకులు పైన అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేసి నిర్బంధించి అజ్ఞాత ప్రాంతంలో ఉంచడం అప్రజాస్వామిక చర్య అని ఈ ప్రభుత్వం యొక్క రాక్షస పాలనను చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా వందలాది పోలీసులతో నోవాటెల్ హోటల్ లో ఉన్న పవన్ కళ్యాణ్ బయటకు రాకుండా నిర్బంధం చేయడం చాలా దారుణం అని అన్నారు. నిన్న విశాఖ ఎయిర్ పోర్ట్ నుండి నోవాటెల్ హోటల్ కి పవన్ కళ్యాణ్ వచ్చేటప్పుడు ఆయన వాహనం ఎక్కి ఆయనను కార్యకర్తలకు అభివాదం చేయడానికి వీలు లేకుండా పదే పదే అడ్డుపడినా డి సి పి పవన్ కళ్యాణ్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అక్రమంగా అరెస్టు చేసిన జనసేన నాయకులను, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ఉపాధ్యక్షులు ఇళ్ళ శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి ముత్యాల రాజేష్, జనసేన నాయకులు కొఠారు ఆదిశేషు, సాయి శరత్, జిల్లా కార్యదర్శి తేజస్విని, సంయుక్త కార్యదర్శి శ్రవణ్ గుప్తా, జిల్లా ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు బొడ్డు గిరి బాబు, వీర మహిళలు, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.