గుంటూరు ( జనస్వరం ) : వేమూరు మండలం కొల్లూరు మండల పరిధిలోని ఇసుక రీచ్ లలో అక్రమ తవ్వకాలతో దొంగిలిస్తున్న ఇసుక దొంగతనo అరికట్టాలని జనసేన పార్టీ నాయకులు కొల్లూరు మరియు వేమూరు పోలీస్ స్టేషన్లో సోమవారం వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి సోము రౌతు అనురాధ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇసుక పాలసీలో భాగంగా జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ వారితో ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో, ఈ ఒప్పందం ఈనెల రెండవ తేదీతో పూర్తి అయిందని, సంబంధిత అధికారులు ఇసుక తవ్వకాలను నిలుపుదల చేయాలని జయప్రకాష్ పవర్ వెంచర్స్ వారికి నోటీసులు ఇవ్వటం జరిగిందన్నారు. అయినా వారిలో స్పందన లేకపోగా, ఇసుక తవ్వకాలు జెసిబిలతో విపరీతంగా తరలిస్తూ ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని పేర్కొన్నారు. గాజులు లంక, చిలుమూరు ఇసుక రీచ్ లలో అక్రమంగా తరలిస్తున్న ఇసుకను నిలుపదల చేయాలని వారు ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. ఇసుక అక్రమ రవాణాని అరికట్టడంలో పోలీసు వ్యవస్థ విఫలమైందని ఇప్పటికైనా ఇసుక అక్రమ రవాణ ని అరికట్టకపోతే జనసేన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు.