గుంటూరు ( జనస్వరం ) : తాడేపల్లి మండలం, గుండెమెడ గ్రామంలో అక్రమ ఇసుక త్రవ్వకాలపై చిల్లపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన క్వారీని పరిశీలించడమైనది.. అక్రమ ఇసుక తవ్వకాలు ఆంధ్రప్రదేశ్ అడ్డగా తయారైందని.. ముఖ్యమంత్రి ఇంటికి కూతవేటు దూరంలోనే నదిగర్భరంలో యథేచ్ఛగా అక్రమ ఇసుక తవ్వతున్న పట్టించుకున్న నాధుడే లేడని జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు అన్నారు.. తాడేపల్లి పరిధిలోని గండిమొడ గ్రామంలో లీజు అయిపోయిన కూడా ఇసుక తవ్వకాలు చేస్తున్నారని విషయం తెలుసుకుని క్వారీ వద్దకు జనసైనికులతో వెళ్లి చూడడం జరిగిందని అన్నారు. యథేచ్ఛగా ప్రకృతిని దోచుకుంటున్నారని విమర్శించారు. పెద్ద పెద్ద ప్రోక్లిన్ తో నదిగర్భరంలో తోడి ఇసుకను బయటకు తిస్తున్నారని రాబోయే విపత్తులు వస్తే ముఖ్యమంత్రి అడ్డంగా నిలబడతాడా అంటూ ప్రశ్నించారు. మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే పరాదాల ముఖ్యమంత్రికి ఇంటికి దగ్గరలో చెరువులో జరిగే అక్రమ ఇసుక తవ్వకలు కనపడలేదా? లేక కళ్ళు మూసుకున్నారా అంటూ గాదే విమర్శించారు. లీజు పత్రాలను చూపించాలని డిమాండ్ చేశారు.. అక్రమాలను అడ్డుకోవాల్సిన పోలీసులు జనసేన పార్టీ వారిని అడ్డుకోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఇసుక తవ్వకాలు అపకపోతే జిల్లా వ్యాప్తంగా ఇసుక రీచ్ ల వద్ద ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. సీయం ఇసుక దొంగలు పట్టుకొని చర్యలు తీసుకోవాలని గాదె కోరారు. జేపీ గ్రూప్ పేరుతో అక్రమ తవ్వకాలు చేసి సొమ్ము చేసుకుంటున్నారని. ఇది భవిష్యత్ తరాల ఆస్తిని దోచుకోవడమేని రాష్ట్ర చేనేత విభాగం అధ్యక్షులు చల్లపల్లి శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయ శేఖర్, గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు బిట్రగుంట మల్లిక, జిల్లా ప్రధాన కార్యదర్శి నారదాసు ప్రసాద్,జిల్లా కార్యదర్శి రావి.రమ, జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి, ఎంటిఎంసీ అధ్యక్షులు మునగపాటి వెంకట మారుతీరావు, శెట్టి.రామకృష్ణ తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరరావు, మంగళగిరి మండల అధ్యక్షులు వాసా శ్రీనివాసరావు, తాడేపల్లి మంగళగిరి మండల కమిటీ సభ్యులు గుండిమెడ చిర్రావూరి గ్రామ రైతులు, గ్రామస్తులు పార్టీ కార్యకర్తలు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.