విజయవాడ ( జనస్వరం ) : రెండు రోజులు క్రితమే ఈ కుట్రను పసిగట్టి విజయవాడ నగర డీసీపీ విశాల్ గున్నికి, ఏసీపీ హనుమంతరావుకు లిఖితపూర్వకంగా జెండా దిమ్మకు తగు భద్రత కల్పించాలని కోరిన అక్రమంగా, కావాలని స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, కార్పొరేటర్ అప్పాజీల కుట్రవలన జనసేన పార్టీ జెండా దిమ్మను తొలగించారు. రక్షణ కల్పించమంటే తొలగించేందుకు సహకరిస్తారా? నగరంలో ఒక్క అక్రమ నిర్మాణాన్ని కూడా తొలగించలేని విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ రాయల్ హోటల్ సెంటర్ మూల మీద ఉన్న జెండా దిమ్మ అక్రమ నిర్మాణమా? విఎంసి అధికారులకి అవినీతి ముడుపులు ముట్ట గడితే వందల వేల గజాల్లో అక్రమ నిర్మాణాలు చేసుకోవచ్చా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనాడు దినపత్రికలో ఐదంతస్తుల బిల్డింగ్ కు అడ్రస్ తెలియదని సమాధానం ఇస్తే జనసేన పార్టీ తరఫున 40 డివిజన్లో మా స్థానిక నాయకులు ఎం. హనుమాన్ ఆ ఇంటి అడ్రస్ చూపించారు అయినా చర్యలు తీసుకోలేని చేతకాని విఎంసి కమిషనర్, అధికారులు జనసేన జెండా దిమ్మెను తొలగిస్తారా? అని ప్రశ్నించారు. దీనిపై జనసేన పార్టీ తరఫున స్పందన బలంగా ఉంటుందని హెచ్చరించారు. విషయం తెలుసుకొని రాయల్ హోటల్ సెంటర్ వద్ద జనసేన జెండా దిమ్మ అక్రమంగా తొలగించిన ప్రాంతాన్ని పశ్చిమ నియోజకవర్గం ఇన్చార్జ్ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ పరిశీలించారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com