సింగరాయకొండ, (జనస్వరం) : ప్రకాశం జిల్లా, కొండేపి నియోజకవర్గం, సింగరాయకొండ మండలంలో శానంపూడి గ్రామములోని పెద్ధ దరవు దగ్గర వైసీపీ ప్రభుత్వ అధికారుల అండదండలతో అక్రమ మైనింగ్ జరుగుతోంది. ఈ విషయం తెలుసుకున్న సింగరాయకొండ జనసేన పార్టీ మండల అధ్యక్షుడు ఐనాబత్తిన రాజేష్ అధ్వర్యంలో ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం నాయకులతో కలిసి విజిలెన్స్ అధికారులకు పిర్యాదు చేయగా వెంటనే స్పందించిన విజిలెన్స్ అధికారులు వాహనాలను సీజ్ చేసి వాళ్ళని పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రౌండ్ లెవెల్ ప్రోగ్రామర్ కేశవరావు అలాగే MRPS నాయకులు కోటి, జనసైనికులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com