Logo
Date of Publish : 10 July 2021, 9:19 am
Editor : Sake Naresh

అధికార పార్టీ అండదండలతో అక్రమ గ్రావెల్ తరలింపు : సర్వేపల్లి జనసేన నాయకులు

               సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం ఈదగాలి పంచాయతీ పరిధిలో అధికార పార్టీ అండతో జరుగుతున్న అక్రమ గ్రావెల్ తరలింపును స్థానిక జనసేన నాయకులు పరిశీలించడం జరిగింది. జనసేన నాయకులు మాట్లాడుతూ ఈ అధికార పార్టీ నాయకుల అండతో పర్మిషన్ తీసుకుని విచ్చలవిడిగా తవ్వకాలు జరుపుతున్నారు.  కోట్ల విలువ చేసే అక్రమ గ్రావెల్ ఏ గ్రామంలో పుష్కలంగా ఉంటే ఆ గ్రామంలో చుట్టుపక్కల తవ్వకాలు జరుపుతున్నారు. ప్రభుత్వ అధికారులు పట్టించుకోరు, పోలీస్ వ్యవస్థ పట్టించుకోదు. ఈ ప్రభుత్వం మాత్రం పాలకులు మాత్రం చూసి చూడనట్టు తెలిసీ తెలియనట్టు నటిస్తుంటారు. ఇకనైనా అక్రమ తవ్వకాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ఎక్కడైతే గ్రామాలకి జన సంచారానికి దగ్గరలో తవ్వకాలు జరిగి ఉన్నాయో ఆ గుంటలలో మూగ ప్రాణులు కానీ మనుషులు కానీ అకాల వర్షంతో నిండిపోతే ఆ గుంతలో పడి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి చుట్టూ రక్షణ వలయం అయినా ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న ల్యాండ్ మాఫియా గ్రావెల్ మాఫియా పైన ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి అలా జరగని పక్షంలో జనసేన పార్టీ నిరసన దీక్ష చేపట్టడానికి సిద్ధం అని అన్నారు. ఈ కార్యక్రమంలో వేంకటాచల మండల నాయకులు వెంకటేష్, మనుబొలు మండల నాయకులు పవన్, సందీప్ ముత్తుకూరు మండల నాయకులు మహేంద్ర, వీర బాబు, బాలు, తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com