Logo
Date of Publish : 04 September 2023, 10:52 pm
Editor : Sake Naresh

అక్రమ గ్రావెల్ తవ్వకాలను ఆరికట్టాలి : జనసేన నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు

      సర్వేపల్లి, (జనస్వరం) : సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండలంలో అక్రమ గ్రావెల్ తవ్వకాలు ఆపాలని   మండల రెవెన్యూ అధికారికి సోమవారం స్పందనలో సర్వేపల్లి నియోజకవర్గ జనసేనపార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండలంలో పొదలకూరు పంచాయతీకి కుసింత వేటు దూరంలో ఉన్న చిట్టేపల్లి తిప్ప సర్వేనెంబర్ 707లో గతంలో ఋషికొండ టూ ను తలపించే విధంగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతుంటే అప్పట్లో జనసేన ఆధ్వర్యంలో ఆందోళన చేయడంతో ఆపారు. మళ్లీ గత మూడు రోజుల నుంచి చిట్టేపల్లి తిప్పలో ఇదే గ్రావెల్ తవ్వకాలు కొనసాగుతూ ఉన్నాయి. అప్పుడు టిప్పర్లతో తోలకాలు జరిగితే ఇప్పుడు ట్రాక్టర్ల ద్వారా తోలకలు జరుగుతున్నాయని తెలిపారు. దీనిపైన ప్రభుత్వ అధికారులు ఉక్కుపాదం మోపాలని స్పందనలో ఆర్జీ ఇవ్వడం జరిగింది.   మీరు గాని ఈ గ్రావెల్ మాఫియా దందా పైన ఉక్కు పాదం మోపకుంటే జనసేన పార్టీ ఆందోళన చేస్తుందని సవినయంగా చేస్తున్నాం. అదే విధంగా ఈ గ్రావెల్ మాఫియా దందా వెనక ఎవరున్నారు, ఎవరు నడిపిస్తున్నారు అనే విషయం అందరికీ తెలుసని ఒక సామాన్యుడు ఒక ట్రక్కు మట్టి తోలుకోవాలంటేనే మండల కార్యాలయాలు చుట్టూ తిరిగి తిరిగి ముగించుకోవాలి. అటువంటిది పర్మిషన్ లేకుండా తిప్పల పైన ఉన్న గ్రావెల్ మొత్తాన్ని దోచుకుపోతుంటే ఎందుకని ప్రభుత్వాధికారులు వీళ్ళ పైన చర్యలు తీసుకోరు అంటే అధికారం ఉంటే ఏమైనా చేయొచ్చు అనేటువంటి ఆలోచనతో ఉన్నట్టున్నారు. ఇకనైనా ప్రభుత్వ అధికారులు స్పందించి, సహజవనులను దోచుకునే వారిపై చర్యలు తీసుకోండని తెలిపారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ యువత పొదలకూరు మండల అధ్యక్షుడు సంజు రాకేష్, శ్రీహరి, చిరంజీవి యువత సర్వేపల్లి నియోజకవర్గం అధ్యక్షుడు ఖాజా, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com