నెల్లూరు ( జనస్వరం ) : కోవూరు నియోజకవర్గం పరిధిలోని తలమంచి మరియు కావలి నియోజకవర్గం పరిధిలోని నార్త్ ఆములూరు గ్రామ శివార్లలోని అటవీ ప్రాంతంలో చెట్లను తొలగించి గ్రావెల్ ని అక్రమంగా తరలించేస్తున్నారని జనసేన నాయకులు అన్నారు. దాదాపు రెండు కిలోమీటర్ల దూరం వరకు 30 గడుగులు లోతుకి గ్రావెల్ తోవ్వేసి అక్రమ సంపాదనకు ఈ గ్రావెల్ మాఫియా తెరలేపారు. ఈ విషయాన్ని నెల్లూరు జిల్లా ప్రభుత్వ అధికారులు అలాగే అటవీ శాఖ అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు. ఒక్క రోజుకు కనీసం 500 టిప్పర్లు లోడుతో ఈ గ్రావెల్ తరలించడం జరుగుతుంది. ఈ అక్రమ గ్రావెల్ తరలించే క్రమంలో ఆ ప్రాంతంలో ఉండే పొలాలు మొత్తం నాశనం అయిపోయాయి. గ్రామం మొత్తం పూర్తిగా ఎర్ర మట్టితో నిండిపోయింది. అధిక సంఖ్యలో టిప్పర్లు తిరగడం వలన రోడ్లు పూర్తిగా ధ్వంసం అయిపోయాయి. అధికారులకు పలుమార్లు చెప్పినాకుడా ఏమీ ప్రయోజనం లేదు, పైగా వైసీపీ నాయకులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని గ్రామస్థులు చెప్తున్నారు. ఈ దందాలో వైసీపీ MLA లు భాగస్వామ్యులు అయి ఉన్నారని.. వాళ్ళని ఎదిరించే ధైర్యం లేక గమ్ముగా ఉండిపోవలసి వస్తుందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని జనసేనపార్టీ తీవ్రంగా ఖండిస్తూ జిల్లా ప్రభుత్వ అధికారులకు, అలాగే కావలి RDO గారికి, అల్లూరు మండల తహశీల్దార్ గారికి, నెల్లూరు RDO గారికి జనసేనపార్టీ తరుపున ఈ గ్రావెల్ దందాని తక్షణమే ఆపేసి పర్యావరణాన్ని కాపాడవలసిందిగా కోరడం జరుగుతుందన్నారు.