
పాలకొండ, (జనస్వరం) : ఇప్పటం గ్రామంలో రోడ్డు వెడల్పు పేరుతో సక్రమంగా కట్టుకున్న ఇళ్లను జగన్ ఆ ఇల్లుని కూల్చడం జరిగింది. మరి ఇప్పటం గ్రామ ప్రజలకు మనోధైర్యం ఇవ్వడానికి ప్రజల తరఫున ప్రజా సమస్యలపై పోరాటం చేస్తే ఈ సైకో ప్రభుత్వం ఇచ్చిన బహుమతి అడ్డుకోవడం ఏ కేసు లేని జనసేన నాయకుల్ని ఆపలేవు? పెట్టుకుంటే పెట్టుకో ఎంత మంది మీద పెట్టుకుంటావో, ఏం చేసుకుంటావో చేసుకో ప్రజలు కోసం అండగా జనసేన పార్టీ ఉంటుంది అని జనసేన జానీ చెప్పడం జరిగింది. మత్స పుండరీకం మాట్లాడుతూ రాష్ట్రంలో వినాసకాలే విపరీత బుద్ధి అన్న సామెత చందంగా వినాసకాలే వైస్సార్సీపీ బుద్ధి ఆనడానికి నిదర్శనం ఇప్పటం గ్రామంలోని ఇల్లు కూల్చివేతేలు. స్వాతంత్ర్య యోధులు మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, ఇండియన్ మిసైల్, భారత దేశం పూర్వ రాష్ట్రపతి ఎ.పి.జె. అబ్దుల్ కలాంల విగ్రహాలను, హిందువులకు పరమ పవిత్రమైన కార్తీక మాసం సమయంలో శివుని వాహనం నంది విగ్రహాన్ని కూల్చడం చూస్తుంటే కుల మతాల పేరిట రాష్ట్రంలో ఘర్షణలు జరిగే విధంగా పిచ్చి తుగ్లక్ జగన్ రెడ్డి చూస్తున్నారు అని అన్నారు. ఇటువంటి హేమమైన చర్యని ఖండిస్తున్నాము. పిచ్చిడి చేతిలో రాయిలా జగన్ పాలన వుంది. ఈ రాష్ట్రన్ని రక్షించాలి, అభివృద్ధి కోరుకునేవాళ్ళు అందరు జనసేన పార్టీలోకి రండి సరికొత్త రాజకీయం వ్యవస్థను నిర్మిద్దాం భవిష్యత్ తరాలకు అండగా నిలబడదాం ఈ కులాల ఐక్యత, సామాజిక న్యాయం జరగాలంటే జనసేనపార్టీ అధికారంలోకి రావాలి పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి జనంకోసం జనసేన ప్రజలు కోసం పవన్ కళ్యాణ్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో వావిలపల్లి నాగభూషన్, దత్తి గోపాలకృష్ణ లు పాల్గొన్నారు.