Logo
Date of Publish : 21 September 2023, 8:57 pm
Editor : Sake Naresh

పరిపాలించడం చేతకాకనే ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు

     అనంతపురం ( జనస్వరం ) : టీడీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ కు నిరసనగా అనంతపురం అర్బన్ నియోజకవర్గం లోని స్థానిక సప్తగిరి సర్కిల్ నుంచి టవర్ క్లాక్ మీదుగా ఆర్ట్స్ కళాశాల ఎదురుగా గల ఎన్టీఆర్ విగ్రహం వరకు నిరసన వ్యక్తం చేశారు. టిడిపి అర్బన్ ఇంచార్జ్ వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఆధ్వర్యంలో టిడిపి వారు చేపట్టిన శాంతియుత కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొని వారికి జనసేన పార్టీ తరఫున రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు  పెండ్యాల శ్రీలత సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిపాలించడం చేతకాక స్థాయికి మించి అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆధోగతిపాలు పట్టించి ప్రజల దృష్టిని మరలించడానికి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని దీనిని జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని జనసేన టిడిపి పార్టీలు కలసికట్టుగా పోరాటం చేసి వైకాపా రాక్షస పరిపాలనను అంతం ఒందించి ప్రజా ప్రభుత్వాన్ని స్తాపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యనిర్వహక ప్రధాన కార్యదర్శి  భవాని రవికుమార్ గారు, జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు జయరామిరెడ్డి, వీర మహిళలు జనసేన పార్టీ జిల్లా, నగర కార్యవర్గ సభ్యులు, జనసేన,టీడీపీ పార్టీల నాయకులు జన సైనికులు తదితరులు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com