తిరుపతి ( జనస్వరం ) : తిరుమల టు నగిరి కేంద్రంగా టార్గెట్ చేసుకొని అభం శుభం తెలియని తనను అక్రమ అరెస్టులు చేసి తన పరువు ప్రతిష్టలను దిగజార్చిన పోలీసుల అధికారులను హెచ్చరిస్తూ, రానున్నది తమ జనసేన ప్రభుత్వమేనని ఒక్కొక్కరికి నరకాన్ని చూపిస్తానని ప్రెస్క్లబ్లో శుక్రవారం జనసేన పార్టీ అసెంబ్లీ ఇన్చార్జ్ కిరణ్ రాయల్ వెల్లడించారు. జనసేన నేతలు జిల్లా ఇన్చార్జి డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ నగర అధ్యక్షుడు రాజారెడ్డి, అడ్వకేట్ ముక్కు సత్తివంతుడు, ఆకేపాటి సుభాషిని, బాబ్జి, కీర్తన, సుమన్ బాబు , కిషోర్, ఆది కేశవులు, రమేష్ తదితరులతో కలిసి కిరణ్ మాట్లాడుతూ గత అక్టోబర్ 18వ తేదీ నగిరి ప్రాంత కౌన్సిలర్ సంధ్యారాణి ఉద్దేశపూర్వకంగా మంత్రి రోజా, టిటిడి ఈవో ధర్మారెడ్డిలపై తాను దుర్భాషలాడానని నగిరి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిందని.. ఈ కేసును సాకుగా తీసుకుని తన పై 25వ తేదీ నుంచి రెక్కీ నిర్వహిస్తూ.. నవంబర్ 10వ తేదీ నుంచి ప్లాన్ చేసి నా ఇంట్లో 11వ తేదీ సాయంత్రం తనను అరెస్ట్ చేయడం ఓ కుట్ర అని కిరణ్ అభివర్ణించారు. తనను అరెస్ట్ చేయడానికి బలమైన కారణం లేకపోవడంతో తనకు ఫోన్ చేసి 41 ఏ నోటిస్ పై సంతకం పెట్టాలని పోలీసులు కోరగా ఇంటికి రమ్మని తాను తెలిపానని, హుటాహుటిన వారు పోలీసు బలగాలతో తనను ఓ ఉగ్రవాదిని అరెస్టు చేసినట్లు.. తిరుపతి నగరం చుట్టూ తిప్పి చివరికి నగిరి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారని తెలియజేశారు..ఇది ఒక కోణం అయితే మరో కోణంలో వైసీపీలోకి తనను చేరాలని ఒత్తిడి తీసుకొచ్చారని, తాను ససేమీరా రానని హెచ్చరించారని.. తనను బ్లాక్ మెయిల్ చేసిన వైకాపా విధానాన్ని వెల్లడించారు. తన ప్రాణం పోయేవరకు పవన్ తోనే ఉంటానని ఆశాభావం వ్యక్తం చేశారు.. తన రెండు కొత్త ఐ ఫోన్లు కోర్టులో సబ్మిట్ చేయకుండా… ఎత్తుకెళ్లిన పోలీసులే తన ఫోన్ ఈ ఎం ఐ లను ఫైనాన్స్ కంపెనీ వారికి ( 2,40,000 విలువచేసే రెండు ఐఫోన్ల) ఇన్స్టాల్మెంట్లను చెల్లించాలని డిమాండ్ చేశారు. కిరణ్ ను ఓ ఉగ్రవాదిలా క్రియేట్ చేసి.. హైదరాబాద్ , బెంగళూర్ లలో తిరుగుతున్నట్లు వెతికి వెతికి… నగిరి, తిరుత్తణీ బైపాస్ లో పట్టినట్లు.. సిని పక్కిలో అరెస్టు చేసినట్లు… ఐపీసీ బదులు వైసిపి ప్లీనరీ కోర్టును ఫాలో అవుతున్నారని డా. హరిప్రసాద్ దుయ్యబట్టారు.. కిరణ్ ఐఫోన్ల లలో డెటాలంతా యూట్యూబ్ లో ఓపెన్ గా ఉన్నాయని , వాటిని రికార్డు చేసుకోవచ్చు కదా అని ఐఫోన్లను దొంగిలించటం దేనికని వారు ప్రశ్నించారు.