Search
Close this search box.
Search
Close this search box.

ఇంటింటా తిరుగుతున్న జయరాం రెడ్డిపై వైసీపీ అక్రమ కేసులా ???

జయరాం రెడ్డి

          అనంతపురం ( జనస్వరం ) : జనసేన జిల్లా ఉపాధ్యక్షుడు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి గారు గత 200 రోజులుగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ అనంతపురం నగరమంతా తిరుగుతూ, అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో దాదాపు 2 లక్షల మంది పైచిలుకు ప్రజలను కలిసి జనసేన పార్టీ ఆవశ్యకతను తెలియజేస్తూ వచ్చే ఎన్నికలలో జనసేన పార్టీని గెలిపించమని ప్రచారం చేస్తున్నారు. ఈ కార్యక్రమం వలన తమ ప్రభుత్వ పనితీరును దాని వైఫల్యాలను జనానికి బట్ట బయలు చేస్తున్నారని, ఈ  కార్యక్రమం వలన జనంలో తమ ప్రతిష్ట అడగంటిపోతుందని భయంతో దుర్బుద్ధితో అనంతపురం ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి మరియు వైసీపీ అధిష్టానం అందరూ కలిసి కుట్రపూరితంగా శ్రీదేవి తదితర YCP మహిళా కార్యకర్తలను రెచ్చగొట్టి వారిచేత జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి, మురళీకృష్ణ, విజయ్ కుమార్ పైన తప్పుడు సమాచారంతో కంప్లైంట్ ఇచ్చారు. ఆ సందర్భంలో శ్రీదేవి తదితరులు మాట్లాడుతూ జయరాం రెడ్డి గారి ఇంటికి దూరుతామని, రోడ్లలో తిరగనియ్యమని, తమ నాయకునికి వ్యతిరేకంగా మాట్లాడితే అంతు తేలుస్తామని, జయరాం రెడ్డి కి ఏమైనా జరగొచ్చు అని డీఎస్పీ ఆఫీసు ముందు మీడియా సమక్షంలో అభ్యంతరకర భాషలో పరుష పదజాలంతో జనసేన కార్యకర్తలని బయోత్పన్నానికి గురి చేసే విధంగా మాట్లాడినారు. శ్రీదేవి తదితర వారిపైన తగిన చర్యలు తీసుకుని తక్షణమే పై వారి పైన క్రిమినల్ కేసు రిజిస్టర్ చేసి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని జనసేన కార్యకర్తలకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేసుకుంటున్నామని జనసేన నాయకులు కోరుతున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way