భద్రాద్రి కొత్తగూడెం, (జనస్వరం) : తెలంగాణ రాష్ట్ర జనసేనపార్టీ ఇంచార్జ్ శ్రీ శంకర్ గౌడ్ మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జ్ శ్రీ రామ్ తాళ్ళూరి ఆదేశాల మేరకు మరియు రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు శ్రీ లక్ష్మణ్ గౌడ్, ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన విభాగ అధ్యక్షులు డేగల రాముల సూచనల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో పాల్వంచ పట్టణంలో నలుగురి మృతికి కారణంగా భావిస్తున్న అనుమానితుడు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవ్ ను విచారించి కఠినంగా శిక్షించాలని జనసేన నిరసన తెలపటం జరిగింది. శాంతియుతంగా నిరసన చేస్తున్న జనసేన నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీసులు. ఈ నిరసన కార్యక్రమంలో యువజన విభాగం ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడు బాకీ సునీల్, యువజన విభాగం ఆర్గనైజింగ్ సెక్రటరీ మైలవరపు మణికంఠ, యువజన విభాగం సెక్రెటరీ గరిక రాంబాబు, యువజన విభాగం ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ గుండ్ల పవన్ కళ్యాణ్, జనసైనికులు బానాల శ్రీకాంత్, బ్రహ్మం, గొల్లపల్లి రాంబాబు, కొండ దేవా ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యార్థి విభాగం కార్య నిర్వహణ మెంబర్ కొడిమే వంశీ, గొల్ల వీరభద్రం, ములకలపల్లి మండల జనసేన నాయకులు తాటికొండ ప్రవీణ్ కుమార్, పొడిచేటి చిన్నారావు చామర్తి సుధాకర్, కందుకూరి వినీత్, అన్నపురెడ్డిపల్లి మండల నాయకులు తలారి రాజు, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com