తిరుపతి, (జనస్వరం) : టీటీడీ లోని ఎఫ్ ఎం ఎస్ కార్మికుల నిరసన దీక్షలకు మద్దతుగా నిలిచిన చిత్తూరు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు డా” శ్రీ పసుపులేటి హరిప్రసాద్ మరియు జనసేన పార్టీ మహిళా నాయకుల అక్రమ అరెస్టులను జిల్లా కార్యదర్శి ఏపీ శివయ్య తీవ్రంగా ఖండించారు. తిరుపతిలోని టీటీడీ ఏడీ బిల్డింగ్ ఎదుట టీటీడీ లోని ఎఫ్ ఎం ఎస్ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గత కొద్ది రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్నది విధితమే. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ తరపున మద్దతు పలుకుతూ జిల్లా అధ్యక్షులు అయిన డా” పసుపులేటి హరిప్రసాద్ తో పాటు రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పగడాల మురళి, జిల్లా ఉపాధ్యక్షులు బత్తిన మధుబాబు, తిరుపతి పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి, చంద్రగిరి నియోజకవర్గం నాయకులు మరియు జిల్లా కార్యదర్శి దేవర మనోహర్, ఆనంద్ తదితర నాయకులను నిర్ధాక్షిణ్యంగా పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి అనంతరం చంద్రగిరి పోలీస్టేషన్ కు తరలించారు. టీటీడీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరడం నేరమా! ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాయడానికి దుర్మార్గపు దాష్టీక పాలన చేయడానికి అధికార దర్పంతో పోలీసులను ఉపయోగించి శాంతియుతంగా నిరసన చేస్తున్న టీటీడీ కార్మికులను వారికి అండగా నిలిచిన జనసేన నాయకులను అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం రోజునే హక్కులను కాలారాసే విధంగా అక్రమంగా అరెస్టు చేయడం అనైతికం. అరెస్టు చేసిన వారిని బేషరతుగా తక్షణమే విడుదల చేయాలి. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.