రాజంపేట ( జనస్వరం ) : జనసేన పార్టీ నాయకులు నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో శాంతియుతంగా ట్రాఫిక్ అంతరాయం కాకుండా నిరసన కార్యక్రమాన్ని చేపట్టుతామని ఎంత చెప్పిన పోలీసు ఉన్నతాధికారులు వినక అక్రమ అరెస్టులు చేయడం జరిగింది. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపే హక్కు కూడా మాకు లేదా. ప్రతిపక్షాలు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను నిరసనల ద్వారా తమ హక్కులను వినిపిస్తాయి. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతిపక్షాల పట్ల వ్యవహరిస్తున్న తీరు చాలా ఆమానుషం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజల సంక్షేమం కోసం పని చేయాల్సిన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఈరోజు సొంత నాయకులు జేబులు నింపుకునే దానికి రియాల్టర్లుగా మారి మరి రాష్ట్ర సంపాదన దోచుకున్న పరిస్థితులు వీటిని నిరసనల ద్వారా ప్రతిపక్షాలు తెలియజేసే కార్యక్రమం తలపెట్టితే పోలీసు వ్యవస్థ ద్వారా గొంతునొకే కార్యక్రమం ప్రభుత్వం చేస్తుంది. నాదెండ్ల మనోహర్ గారి అక్రమ అరెస్ట్ చిట్వేల్ మండలంజనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ బేషరతుగా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com