జగ్గంపేట ( జనస్వరం ) : జనసేన పార్టీ అద్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా జగ్గంపేట నియోజకవర్గంలో ప్రారంభించిన జనం కోసం జనసేన మహాయజ్ఞం 661వ రోజు కార్యక్రమంలో భాగంగా గోకవరం పట్టణంలో పర్యటించిన జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోనీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ఈ జనం కోసం జనసేన అనే మహాయజ్ఞం ద్వారా ఇప్పటికే చాలా ప్రజా సమస్యలకు పరిష్కారం చేసి నియోజకవర్గంలోని నిరు పేదలకు సహాయం చేశాం అని అన్నారు. ఈ నేపథ్యంలో గోకవరంలోని సంజీవయ్య నగరంలో ఒక ఇంటిలో నివసిస్తున్న అన్నా చెల్లెళ్ళు అయిన ఇద్దరు వృద్ధులను కలవడం జరిగింది. వారిలో అన్నయ్యకి 87 సంవత్సరములు, చెల్లెలికి 82 సంవత్సరములు వయస్సు. వారు చాలా నిరుపేదలు మరియు చాలా దీనావస్థలో ఉన్నారు. వారు 75 రూపాయలు ఉన్నప్పటి నుండి పింఛను తీసుకుంటున్నారు. వారిరిరువురికి పింఛను 75 రూపాయల నుండి 2000 రూపాయల వరకు వచ్చింది. కానీ ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి వారిలో ఒకరికి పింఛను నిలిపివేయడం జరిగింది. ఇలా ఎందుకు జరిగింది అని అధికారులను కోరగా, ఒక రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే పింఛను ఇవ్వడం జరుగుతుందని సమాధానం ఇచ్చారు. మాకు ఇంత వయసు పైబడిన సమయంలో మేము ఇద్దరమూ మాకు వచ్చే పింఛన్ల పైనే ఆధార పడుతున్నాం అలాంటిది మాకు పింఛను రాకుండా నిలిపివేయడం వలన చాలా ఇబ్బందులకు గురవుతున్నామని వారు చెప్తున్న తీరు చూసి చాలా ఆవేదనకు లోనయ్యాను అని అన్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని వయసు పైబడిన వృద్దులందరకు తప్పని సరిగా పింఛన్లు వచ్చేలా చెయ్యాలని జనసేన పార్టీ తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పింఛన్లు నిలిపివేయబడిన వృద్దులందరిని సంబంధిత అధికారులు వద్దకు తీసుకుని వెళ్లి నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.