Logo
Date of Publish : 10 October 2020, 10:44 am
Editor : Sake Naresh

నియోజకవర్గంలో ఉన్న చెత్త కుప్పలను పట్టించుకోరా ??? : పోలిశెట్టి చంద్రశేఖర్

నియోజకవర్గంలో ఉన్న చెత్త కుప్పలను పట్టించుకోరా ??? : పోలిశెట్టి చంద్రశేఖర్

             రామచంద్రపురం మున్సిపాలిటీ కొత్తూరు డంపింగ్ యార్డ్ నందు రోడ్డు సగం భాగం వరకూ పోడవునా చెత్త ను విచ్చలవిడిగా వేయడం జరిగింది ఇలాంటివి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇతర ప్రాంతాలకు తరలించాలని ఈ సమస్య పై జనసేన పార్టీ, బిజేపి పార్టీ ల ఆద్వర్యంలో ఈ రోజు గళం ఇచ్చి ప్రశ్నించడం జరిగింది. గతంలో మన మంత్రివర్యులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలక్రిష్ణ గారు స్వచ్ఛా రామచంద్రపురం, స్వేచ్చారామచంద్రపురం అని రకరకాల స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇది స్వచ్ఛా రామచంద్రపురమా? చెత్త రామచంద్రపురమా? అని మేము ఈ డంపింగ్ యార్డ్ రోడ్డు పొడవునా సగం రోడ్డు వరకూ చెత్త ని చూసి అడుగుతున్నాం అని నియోజకవర్గ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ గారు అన్నారు. ఈ డంపింగ్ యార్డ్ వల్ల చాలా మంది ఈ దారిన వెళ్ళే వాళ్ళు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ, ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీని ప్రక్కనే ఉండే పశువులు కూడా చెత్తా చెదారాన్ని తింటూ అవి కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అంతేకాకుండా ఈ చుట్టుపక్కల పంటపొలాలు ఉన్నాయి.తినుబండారాలు కూడా నాశనం అయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన స్వచ్ఛా రామచంద్రపురం స్వేచ్చా రామచంద్రపురం అని చెప్పడం లో చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇలాంటి దాన్ని ముందు తొలగించిన తర్వాత ఆయన నోటి నుండి స్వచ్చా రామచంద్రపురం రావాలి తప్ప అప్పటి వరకు కూడా మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం మా జనసేన పార్టీ కూడా దీన్ని ఖండిస్తుంది. అని కూడా తీవ్రంగా తెలియజేస్తున్నాం అని రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ గారు మీడియా పూర్వకంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బుంగారాజు గారు, బిజేపి జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేశ్వర రావు గారు, పలివెల రాజు గారు మరియు తదితర జనసేన, బిజేపి నాయకులు, జనసైనికులు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com