రాయచోటి ( జనస్వరం ) : అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణ పరిధిలోని ANB ఫంక్షన్ హాల్లో రాయచోటి జనసేన పార్టీ అసెంబ్లీ ఇన్చార్జ్ హుస్సేన్ బాషా ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ ఇఫ్తార్ విందులో ఆర్గనైజింగ్ సభ్యులు,షేక్ రియాజ్, పఠాన్,షబ్బీర్ అలీ నిర్వహించారు. జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్ మాట్లాడుతూ రంజాన్ మాసం పురస్కరించుకుని పార్టీ తరపున ఇఫ్తార్ విందు చేపట్టిన సందర్భంగా అభినందిస్తూముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కడప జిల్లా, రాయచోటి, రాజంపేట నియోజకవర్గాల మరియు వివిధ మండలాల జనసేన పార్టీ నాయకులు, ముస్లిం మైనార్టీలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com