మదనపల్లి ( జనస్వరం ) : రంజాన్ మాసంలో నిర్వహించే ఇఫ్తార్ విందు స్నేహం, పరస్పర సహాయకారం అనుబంధాన్ని సూచిస్తుందని జనసేన పార్టీ రాయల దక్షిణ కోస్తా పార్లమెంటరీ సమన్వయ కర్త మైఫోర్స్ మహేష్ అన్నారు. రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు నిర్వహించే ముస్లిం మైనారిటీలకు ఎంజీ గ్రాండ్ నందు మైఫోర్స్ మహేష్ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉపవాస దీక్షల అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మైఫోర్స్ మహేష్ మాట్లాడుతూ రంజాన్ మాసం పవిత్రకు సూచిక అని నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు వుండే ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇవ్వడం ఆనవాయితీ అన్నారు. ఈ సందర్భంగా ముస్లిం మైనారిటీ నాయకులు మాట్లాడుతూ మైనారిటీలకు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు ఇచ్చి కుల, మతాలకు అతీతంగా ఆప్యాయంగా పలకరించే వ్వక్తి మైఫోర్స్ మహేష్ అని కొనియాడారు. అల్లహ్ దీవెనలతో మైఫోర్స్ మహేష్ ఎల్లప్పుడూ సుసంపన్నంగా, ఆరోగ్యంగా ఉండాలని, రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. జనసేన పార్టీ కోసం నిరంతరం కష్టపడే జనసైనికులు జనసేన పార్టీ ముస్లిం మైనారిటీ నాయకులు సోను, అయాజ్, జాఫర్, సద్దాం, అప్సర్, సల్మాన్, పార్టీ ముఖ్య నాయకులు ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com