ఆత్మకూరు ( జనస్వరం ) : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలని దృడసంకల్పంతో ఆత్మకూరు నియోజకవర్గంలో చేపట్టిన పవనన్న ప్రజాపాట ప్రజల ఆశీర్వాదంతో 11వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గ ఇన్చార్జి నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గ వ్యాప్తంగా రైతాంగాన్ని పుష్కరకాలంగా వేధిస్తున్న చుక్కల భూముల సమస్య గురించి మనకందరికీ తెలిసినదే. రాష్ట్ర విభజనకు పూర్వము మొదలైన ఈ సమస్యను తెలంగాణ ప్రభుత్వం రైతుల అర్జీలతో సంబంధం లేకుండా ప్రభుత్వం వద్దనున్న ఆధారాలను ఆధారం చేసుకుని పరిష్కరించడం జరిగింది. అదే పద్ధతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు మరియు కర్నూలు జిల్లాల్లో కూడా పరిష్కరించడం జరిగింది. కానీ నెల్లూరు జిల్లాలో అందుకు విరుద్ధంగా రైతాంగాన్ని వేదనకు గురి చేస్తున్నారు. కేవలం రైతాంగం మాత్రమే కాకుండా ఆత్మకూరు నియోజకవర్గ నివాస ప్రాంతాలైన వెంకట్రావుపల్లి,నెల్లూరు పాలెం, నర్సాపురం, ముస్తాపురం తదితర నివాస ప్రాంతాల్లో గృహ సంబంధించిన అంశాల్లో కూడా చుక్కల భూముల సమస్య ముడిపడి ఉంది. చుక్కల భూముల సమస్యను, రైతులను ఎటువంటి ఇబ్బందులకు గురి చేయకుండా సుమోటోగా శాశ్వత పరిష్కారం కనుగొనాలంటే జనసేన పార్టీకి ఓటెయ్యాలి అని నియోజకవర్గ ఇన్చార్జ్ నలిశెట్టి శ్రీధర్ తెలిపారు. 11వ రోజు పవనన్న ప్రజాబాట కార్యక్రమం సందర్భంగా మున్సిపల్ పరిధిలోని తూర్పు వీధి మరియు టెంకాయతోపు ప్రాంతాలలో ఈరోజు పర్యటించి అక్కడ స్థానిక ప్రజల ఇబ్బందులను తెలుసుకొని వాటి పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు సురేంద్ర, వంశీ, చంద్ర, పవన్, చైతన్య, శ్రీహరి, ఏడుకొండలు, నాగరాజు, అనిల్, హాజరత్, భాను, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com