ప్రకాశం, (జనస్వరం) : ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ గారి పిలుపు మేరకు మరియు కొండేపి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు కనపర్తి మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో "ప్రజాభిప్రాయ సంతకాల సేకరణ" కార్యక్రమం ఈరోజు పొన్నలూరులో నిర్వహించడం జరిగింది. కందుకూరు నుండి కనిగిరి వరకు ఉన్నటువంటి ప్రధాన రహదారిలో ముఖ్యంగా ముత్తరాసుపాలెం నుండి అగ్రహారం వరకు ఉన్న రహదారి నిత్యం ప్రమాదాలకు దారి తీస్తుంది. ఇప్పుడున్న నాయకులకు గానీ అధికారులకు గానీ పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్న తీరు ప్రజలందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ వైసీపీ నాయకులకు ఎందుకు ఓటు వేసి గెలిపించామె...? అని ప్రజలంతా బాధతో కన్నీరుమున్నీరవుతున్నారు. నిత్యం ఈ రహదారిలో యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటే నాయకులు చూసి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. జనసేన పార్టీ నాయకులు ఈరోజు ఈ రహదారిలో ప్రయాణించే ప్రయాణికుల ఇబ్బందులు తెలుసుకుని వారి యొక్క అభిప్రాయాలు సేకరించి వారి నుండి సంతకాలు స్వీకరించాము. పొన్నలూరు మండలం RI గారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. అదే విధంగా R&B అధికారులకి కూడా సోమవారం రోజున వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. మేము స్వీకరించిన "ప్రజాభిప్రాయ సంతకాల సేకరణ" పత్రాలను సోమవారం రోజు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి సమస్యను వివరించడం జరుగుతుందని అన్నారు. ఈ రహదారికి శాశ్వత పరిష్కారం చూపించకపోతే జనసేన పార్టీ నుండి మేము అతి త్వరలో "దీక్ష " చేపడతాము. ఈ రోడ్డుకి ప్రభుత్వం నుండి పరిష్కార మార్గం జరిగేలా చేస్తాము. ప్రజల కోసం, ప్రజల పక్షాన, ప్రజలకు అండగా, ప్రజలకు తోడుగా, ప్రజలకు ధైర్యంగా, జనసేన పార్టీ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కనపర్తి మనోజ్ కుమార్ తో పాటు డేగల దొరస్వామి నాయుడు, తిరుమల్ రెడ్డి, నరేంద్ర, ఐనబత్తిన రాజేష్, శ్రీకాంత్, నాగార్జున, రానా, రమేష్, చంద్ర శేఖర్, భాషా, భార్గవ్, సాయి, మహమ్మద్ భాష, ఖాజావలి, లక్ష్మణ్ మొదలైన జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com