Logo
Date of Publish : 05 January 2023, 5:42 am
Editor : Sake Naresh

అన్ని స్థానాల్లో గెలుస్తామన్న నమ్మకం ఉంటే అసెంబ్లీ రద్దు చేసి రండి

• సీఎంకు గాజువాక జనసేన నేతల సవాలు 

    గాజువాక, (జనస్వరం) : నర్సీపట్నం సభలో ముఖ్యమంత్రి మతిభ్రమించి మాట్లాడారని జనసేన పార్టీ గాజువాక నియోజకవర్గ నాయకులు, వీర మహిళలు మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ని, జనసేన పార్టీని చూసి భయపడే ముఖ్యమంత్రి వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారన్నారు. జగన్ రెడ్డి తుగ్లక్ పాలనతో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని ప్రజలు నానా ఆబ్బందులు పడుతున్నారని తెలిపారు. గాజువాకలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం మీద వస్తున్న ప్రజా వ్యతిరేకత నుంచి దృష్టి మళ్లించడానికి ముఖ్యమంత్రి మాయమాటలు చెబుతున్నారన్నారు. 175కి 175 స్థానాలు గెలుస్తామన్న నమ్మకం ఉంటే వెంటనే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు సిద్ధం కావాలని సవాలు విసిరారు. మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి గడసాల అప్పారావు, గవర సోమశేఖర్ రావు, కాద శ్రీను, ముమ్మను మురళి, పిడుగు బంగారు రాజు, వీరమహిళలు గొన్నా రమాదేవ, కరణం కళావతి, లక్ష్మీ, అల్లూరి రామారావు, పి. వసంత్, కోటిని గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com